BREAKING : టిడిపి కార్యకర్తల ఇళ్ళ మీద దాడిచేసి బంగారం,డబ్బులు ఎత్తుకుపోయిన వైకాపా నేతలు

రాజకీయాలు అన్నాకా ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమే. కొన్ని ప్రాంతాల్లో దాడులు సైతం ఉంటాయ్. ఇప్పటికి వైకాపా కి బలం ఉన్న కడప, చిత్తూరు, నెల్లూర్ లాంటి చోట్ల వైకాపా బరితెగించి దాడులకు తెగబడుతుంది. నెల్లూరు లో అయితే ఈ మధ్య అధికార, ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు, మండల స్థాయి నేతల మధ్య వివాదాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ఇరువర్గాలు రోడ్డున పడి కొట్టుకోవడం కేసులు, కోర్టులు దాకా వెళ్లడం మామూలైపోయింది. ముఖ్యంగా తాజాగా, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మారుపూరు ఎస్సీ కాలనీలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య నిన్న అర్ధ రాత్రి ఘర్షణ జరిగింది. సుమారు గంట పాటు ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరువర్గాల్లో కొందరికి గాయాలైనట్లు సమాచారం. తెదేపా వాళ్ళు మా ఇళ్లపై వైసీపీ నేతలు దాడిచేసి బంగారం, నగదు దోచుకెళ్లారని టీడీపీ వర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ వ్యవహారంలో నిజానిజాలేంటి? ఏ విషయంలో గొడవపడ్డారు? అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారని సమాచారం. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here