BREAKING : మరొక వైకాపా ఎమ్మెల్యేకు ఏసిబి నోటీసులు

నీతికి నిజాయితీ కి మారుపేరులా అవినీతి జరిగినా జరగకపోయినా, అవినీతి జరిగింది అని గుండెలు బాదుకుంటూ కేసులు వేస్తారు కొందరు. అలానే 12 ఓట్ల ఎమ్మెల్యే గా గుంటూరు జిల్లలో పేరు పొందిన, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా. ప్రభుత్వ సదావర్తి భూముల వ్యవహారాన్ని రచ్చ చేసారు, జగన్ ఆదేశాలతో కేసులు వేస్తూ ఉంటారు. అలా అని ఈయన నీటి నిజాయితీ కి మనిషి రూపమా అంటే కాదు అంటుంది ACB.  మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బినామీ ఆస్తుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. పోలీసు కేసులు, ఏసిబి, సిబిఐ విచారణ, కోర్టు హాజరు ఇలాంటివి ఆ పార్టి నియామావళి లో భాగంగా ఉంటాయేమో తెలియాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్,మేకపాటి రాజమోహన్ రెడి చెక్ బౌన్స్ కేసు, పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి A1, విజయ సాయి రెడ్డి A2… వీళ్ళు అధికారంలోకి ఎలా వద్దాం అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here