MUST READ : ఈ విశ్లేషణ చదవితే చంద్రబాబుకి పాదాభివందనం చేస్తారు.

చంద్రబాబు రాజకీయాల్లో ఒక విభిన్న శైలి లో దూసుకుపోతూ ఉంటారు. సమస్యలు చుట్టుముట్టినపుడే ఆయనలోని అపర చాణక్యుడు బయటకి వస్తూ ఉంటాడు. మోడీ, అమిత్ షా,జగన్ మోహన్ రెడ్డి, రఘువీరా రెడ్డి, ముద్రగడ, పవన్ కళ్యాణ్ ఇలా అందరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఆయనని ఎండగట్టడం, యుసిలు ఇవ్వలేదని చెప్పినా, అవినీతి జరుగుతుందని ఆరోపించినా, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించినా, పుస్తకాలు రాసినా, లోకేష్ అవినీతి చంద్రబాబుకి కనపడటం లేదా అని ప్రశ్నించినా,వాటి అన్నింటి లక్ష్యం చంద్రబాబే.. చివరికి అవిశ్వాసం చంద్రబాబు కాపి కొట్టారని ఆరోపించినా సరే ప్రజలు వారిని ఎందుకు నమ్మడం లేదు…? కారణం ఏంటో తెలుసా

ప్రధాన మంత్రి గారు మా ఎంపీలు అనారోగ్యంగా ఉన్నారండి..ఒక్కసారి చుడండి అని వినయంగా, పాదాభివందనం ట్వీట్ వేసి మరీ జగన్ ప్రధానిని అడిగారు…దీని వెనుక ఉన్న అర్ధం..జగన్ ప్రధానికి నొప్పి తగలకుండా చూస్తున్నారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. నాకు ప్రధాని అంటే వ్యక్తిగతంగా ఇష్టం. నిధులు ముఖ్యం హోదా అసలు విషయమే కాదు, అని జాతీయ మీడియాలో ప్రధాని వినేలా మాట్లాడినా, అది కుడా ప్రధానికి ఆగ్రహం కలగకుండా సున్నితంగా వ్యవహరిస్తూ రాజకీయం చెయ్యడం అనేది స్పష్టంగా అర్ధమవుతుంది.కాని చంద్రబాబు అలా కాదు మోడీ అంటే ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఎంపీలతో ప్రధాని ఇంటి ముందు దీక్ష చేయించారు. ఎన్డియే నుంచి బయటకు వచ్చి అవిశ్వాసం అంటూ విపక్ష పార్టీల మద్దతు కూడగట్టారు. జాతీయ పార్టీలు స్వచ్చందంగా మద్దతు ఇచ్చేలా చేసారు. అదే విధంగా రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని చెప్పిన మాటలను ఎండగట్టారు సాక్ష్యాలతో సహా జాతీయ మీడియా ముందు చూపించారు. ఫలితంగా బిజెపి ఆత్మ రక్షణలో పడిపోయింది. ఒక్క నాయకుడు కూడా నోరెత్తి చంద్రబాబుని విమర్శించలేక గమ్మున ఉండిపోయారు. చంద్రబాబు మీడియాతో సంభాషించిన వీడియోలు ప్రసారం చేయవద్దంటూ చానెళ్ళని బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితికి దిగజార్చారు. ఎవరు ఏమన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మోడీ అనే వ్యక్తి శత్రువు, మోడీ పేరు వింటేనే ఆంధ్రప్రదేశ్ జనం ఒంటి కాలు మీద లేస్తున్నారు. పైన పేర్కొన్న రెండు సంఘటనల్లో

కూడా ప్రధానిని ఒక్క మాట అనకుండా కమ్యునిస్టలతో కలిసి పవన్ డ్రామా ఆడటం, కేసులకు భయపడి జగన్ లాలూచి పడటం… ఇవన్నీ ప్రజలు గమనించకుండా ఉండరు కదా. ఇక రాష్ట్ర బిజెపి నేతల పరిస్థితి తెలిసిందే,దూకలేక, నడవలేక రాజకీయం చేస్తున్నారు.కాని చంద్రబాబు దూకుడు ముందు నిలబడలేకపోతున్నారు. చివరిగా ప్రజలు హీరోగా చూస్తున్నది చంద్రబాబుని.. అందుకే ఆయనకు మద్దతు పెరిగింది, పెరుగుతుంది. ఇది గమనించకుండా తెర చాటు రాజకీయాలు చేస్తే ప్రజలు అర్ధం చేసుకోలేనంత విజ్ఞత లేని వారు కాదు అనేది వాస్తవ౦. ఇప్పటికే ప్రజలు బిజెపి కి తోక పార్టీలుగా వైకాపా జనసేన ని భావిస్తూ వస్తున్నాయి, ఆ నమ్మకాన్ని మరించ పెంచాలి అనేమో విజయసాయి రెడ్డి చంద్రబాబు ని విమర్సిస్తూ PMO చుట్టూ రౌండ్లు కొడుతున్నారు. కాంగ్రెస్ కూడా చంద్రబాబు ని విమర్సిస్తుంది కాని, జాతీయా స్థాయి లో ప్రత్యర్ధి అయిన బిజెపి ని ఏమి అనలేక పోతుంది అంటేనే పరిస్థితి అర్ధమవుతుంది కదా. రేపు కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే చంద్రబాబు రాజకీయ౦ కచ్చితంగా కారణమవుతుంది. ఆ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే దేశ వ్యాప్తంగా బిజెపి పొడిచింది ఏమి లేదనే స్పష్టతకు ప్రజలు రావడానికి పెద్ద సమయమే పట్టదు…ఇది గమనిస్తే మంచిది..చంద్రబాబు వంటి నేతతో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం..RSS సైతం గత వారం ఇదే అభిప్రాయం వ్యక్తపరిచింది. ఇలాంటి ఒక పరిస్థితి లో రాష్ట్రాన్ని, పార్టీని దుష్టశక్తుల నుంచి కాపాడుతున్న చంద్రబాబు కి పాదాభివందనం చెయ్యాల్సిందే కదా.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here