ఊహించని షాక్ : మోడీకి చెక్ పెట్టిన యోగి ఆదిత్యనాథ్

Advertisements

ఒకవైపు మేము దళితులకు అనుకూలం అంటూనే మరోవైపు కాషాయ చిందులు వేస్తుంది బిజెపి. చివరికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని కూడా వారు వదలిపెట్టలేదు. వివరాల్లోకి వెళితే ఉత్తరాదిన కీలకమైన ఉత్తరప్రదేశ్ లో బిజెపికి పాలనపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ దళితుల విషయంలో అగౌరవంగా వ్యవహరిస్తున్నారని అక్కడి ఎంపీలే ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా నేరుగా మోడికి కూడా ఫిర్యాదు చేశారు. సావిత్రి బాయి అనే దళిత BJP ఎంపి అయితే మోడీకి వ్యతిరేకంగా


వ్యాఖ్యలు కుడా చేశారు. అట్రాసిటి కేసుని వారు నీరుగార్చారని ఆగ్రహం వ్యక్త౦ చేశారు. ఇవి ఇలా జరుగుతున్న సమయంలోనే బిజెపి ప్రభుత్వం దళితులు దైవంగా భావించే అంబేద్కర్ కి కాషాయ రంగు పూశారు అక్కడి అధికారులు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, బస్సులకు కాషాయ రంగు వేసి తనదైన ముద్ర వేస్తున్న యోగి సర్కారు తాజాగా కాషాయ రంగు అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పి వివాదాల్లో చిక్కుకుంది. యూపీలోని బడౌన్‌ జిల్లా దుగరయ్యాలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో జిల్లా అధికారులు హుటాహుటిన మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.కొందరు ఎంపిలు నేరుగా ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తూ, యోగీ ఆదిత్యనాథ్ తమను అగౌరవ పరిచారని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తనని బయటకి గెంటివేశారని తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం దళితులకి చేసింది ఏమీ లేదని, కేవలం మాటలతో దళితులని మోసపుచ్చాలని చూస్తున్నారని ఘాటుగానే విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక హిందుత్వం పేరుతో దళితులపై దాడులకి తెగబడుతున్నారని విమర్శిస్తూ రాసిన ఉత్తరాన్ని పత్రికలకి విడుదల చేశారు. అంతేనా ఉత్తర ప్రదేశ్ లో రేప్ మరియు లాకప్ డెత్, కాశ్మీర్ లో పసిపాప మరణం ఇలా ఒకటి కాదు చాలా సమస్యలతో సతమతమవుతుంది బిజెపి. కాని ఉత్తర ప్రదేశ్ లో అటు చేసి, ఇటు చేసి యోగి సర్కార్ నిర్ణయాలు మోడీ కే చెక్ పెట్టే విధంగా మారాయి.

Advertisements

Leave a Reply