ఏ మంత్రం వేసావె మూవీ బుల్లెట్ రివ్యూ

Advertisements

ఎప్పటి నుంచొ రిలీజ్ కావాల్సిన ఏ మంత్రం వేసావె మొత్తానికి అడ్డంకులు అన్ని అధిగమించి విడుదల అయ్యింది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ,కెరీర్ ప్రారంభంలో ఇందులో హీరోగా న‌టించారు.అయితే పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల త‌ర్వాత ఈ సినిమా విడుద‌ల కావ‌డంతో కెరీర్ స్టార్టింగ్‌లో విజ‌య్‌దేవర‌కొండ ఎలా న‌టించాడ‌నే ఆస‌క్తి క‌లిగింది. అస‌లు ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ మ‌ర్రి ఈ సినిమా ద్వారా ఎలాంటి మంత్రం వేశాడో తెలుసుకోవాలంటే మా బుల్లెట్ రివ్యు లోకి వెళ్దాం

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

సోష‌ల్ మీడియా కార‌ణంగా యువ‌త ఆలోచ‌న‌లు మారిపోతున్నాయి, వాటి ప్రభావం ఏంటి అనేది సినిమా మూల కథ

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన యువ‌కుడిగా విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది.

శివాని సింగ్ చెప్పుకోదగిన నటన కనబరచలేకపోయింది

ఈ మూల కథ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయ్

నార్మల్ కథ ని స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునేలా తియ్యగలిగితే బావుండేది, అయితే ఇందులో అది లేదు

చాలా సాధారణం గా ఉంటుంది టేకింగ్

ఇది బావుంది అని చెప్పుకునే మూమెంట్స్ సినిమాలో లేవు

సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది

సినిమాటోగ్రఫీ అనే విభాగం అసలు ఉందా అనిపించే అంత పేలవం గా ఉంది.

విజయ్ దేవరకొండ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ ని వాడుకోటానికి రిలీజ్ చేసారు కాని, అసలు ఏమి లేదు

విజయ్ దేవరకొండతో సహా అందరు మర్చిపోదగిన సినిమా

ఓవరాల్ గా కళ్ళు మూసుకుని వదిలేయ్యోచ్చు. అసలు బాలేదు

ఆంధ్రుడు రేటింగ్ : 1.25/5

Advertisements

Leave a Reply