పది మంది మేధావులు, ఒక గంట మేధో మధనం, ఒక సూపర్ ఐడియా, అతి పెద్ద సెల్ఫ్ గోల్

Advertisements

జగన్ అధ్యక్షతన వైసీపీ నేతలతో మొన్న ఒక కీలక సమావేశం జరిగింది. ప్రత్యేక హోదా గురించి ఈ సమావేశంలో తీవ్రం గా చర్చించారు. పాదయాత్రకు విరామమిచ్చి మరీ కలిగిరి మండలం పెద్దకొండూరులోని వైఎస్ జగన్ బస చేసే శిబిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీలు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు.అలాగే కేంద్రం ఇచ్చిన నిధులు, విభజన

హామీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ చర్చ జరిగాక పార్టి కి చెందిన ఒక పది మంది ముఖ్యనేతలతో మరొక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం లో ఏప్రిల్ ఆరు న రాజీనామా చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదాపై మార్చి 5 నుంచి పార్లమెంట్‌లో ఆందోళనలు చెయ్యాలని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించారు. అదే విషయాన్నీ ప్రజా సంకల్ప యాత్ర లో ప్రకటించారు.అయితే దాని వెనుక ఉన్న రాజకీయ కుట్ర గురించి సోషల్ మీడియా లో విపరీతం గా పోస్టింగ్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ చేసిన ప్రకటన వెనుక ఉన్న ప్లాన్ లీక్ అయ్యి రచ్చ రచ్చ అయ్యింది. వాళ్లు రాజీనామా చేస్తాము అని చెప్పింది ఏప్రిల్ 6. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక ఎంపీ స్థానం ఖాళీ అయితే ఉప ఎన్నికలు 6 నెలలలోపు నిర్వహించాలి. ఒకవేళ సాధారణ ఎన్నికలు సంవత్సరంలోపు ఉంటే ఉప ఎన్నికలు రావనే సంగతి తెలిసిందే. .2014లో ఎన్నికలు ఏప్రిల్ 7 నుండి మే 12 వరకు జరిగాయి అంటే.. ఇప్పుడు ఏప్రిల్ 6, 2018న వాళ్లు రాజీనామా చేసినా అది ఆమోదం పొంది, ఎన్నికల సంఘంకి వెళ్లి ఎన్నికల షెడ్యూల్ వచ్చే సరికి సమయం సరిపోదు కాబట్టి ఎన్నికలు రావు. కాబట్టి ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. జగన్‌కి కూడ ఉప ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం కూడా లేదు. జగన్ చేయిస్తానన్న రాజీనామాల వెనుక ఎంతో వ్యూహం ఉంది అనేది అసాధారణం గా బయటకి రావటం తో ప్రజల్లో విశ్వసనీయత పోతుందేమో అని వైకాపా భయపడ్డుతున్నట్టు గా తెలుస్తుంది.అ విధం గా పది మంది మేధావులు ఒక గంట మేధో మధనం చేసి తెచ్చిన ఒక సూపర్ ఐడియా అతి పెద్ద సెల్ఫ్ గోల్ గా మారి వైకాపా కు షాక్ ఇచ్చింది.

Advertisements

Leave a Reply