BREAKING : వైకాపా నుంచి TDP లోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ షాక్

2014 ఎన్నికల తర్వాత అధికారానికి దూరం అయ్యి, ఆ కోపం లో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. ఒకానొక సమయం లో నేను తలుచుకుంటే ప్రభుత్వం పడిపొద్ది అని సెలవిచ్చారు. మాకు తెలుగు దేశం ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని చెప్పారు. అధికారం లో ఉన్న పార్టి నుంచి  గట్టిగా గాలి వస్తే కూలిపోయే పార్టి కి ఎవరు వెళ్తారు అన్న సందేహం అందరికి ఉంది. అయినా కాని జగన మోహన్ రెడ్డి చేసియన్ వ్యాఖ్యలు ఎవరు పట్టించుకోలేదు.వాస్తవానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాలు చేసే టైమ్ లేదు, కొత్త రాజధాని, భూ సేకరణ నిధుల సమీకరణ తదితర పనుల్లో ఉన్నారు. జగన్ ఈ ప్రకటన చేసాక… మరి అతని చాలెంజుల వల్లనో ఏమి కాని…

గాలికి మామిడి కాయలు పడ్డట్టు టపటప 22 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం లోకి వచ్చారు. వాళ్ళలో నలుగురు కి మంత్రి పదవులు కుడా వచ్చాయి. అలా ఆపరేషన్ ఆకర్ష తప్పా ఒప్పా పక్కన పెడితే అసలు అది ప్రారంభించిందే మాన్య మహోదయ్ వైఎస్సార్ గారు అని చెప్పే పని లేదు. 2009 ముందు ఎంత మంది నాయకులు వెళ్ళారో అందరికి తెలుసు. ఇదిలా ఉంటె తెలుగు దేశం ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉండొచ్చు, మేము ప్రభుత్వాన్ని పడగోట్టొచ్చు కాని మా ఎమ్మెల్యేలు తెలుగు దేశం లోకి ఎలా వెళ్తారు? వాళ్లకి మంత్రి పదవులు ఎలా ఇస్తారు? విలువలు కల రాజకీయాలు చెయ్యటానికి వచ్చా అన్నారు మాన్య చిన్న మహోదయ్ జగన్ మోహన్ రెడ్డి గారు. అయితే రాజకీయాల్లో ఇవ్వాళా రేపు వలసలు కామన్ గానే ఉన్నాయి.కాని నైతికం గా అది తప్పు అని కొందరు అంటే, అధికారం లో ఉన్నప్పుడు అటు వెళ్ళటం కరెక్ట్ కదా అని కొందరు అంటారు. కాని న్యాయపరం గా అది తప్పే. ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.కాగా పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు పొందిన

ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిల ప్రియలకు రాజ్యాంగం ప్రకారం ఆ పదవుల్లో కొనసాగే అర్హత ఎంతమాత్రం లేదని, అందువల్ల వారి మంత్రి పదవులను  రద్దు చేయాలని కోరుతూ రాంబాబు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here