వైకాపా వేసిన ఈ కొత్త ఎత్తుగడ చుస్తే, వాళ్ళు అధికారం లోకి రారు అని ఒప్పుకుని తీరాలి

Advertisements

రాజకీయాల్లో కావాల్సింది ముఖ్యం గా ప్రజలకి భరోసా ఇవ్వగలగటం. మీకు సమస్య వస్తే మేము ఉన్నాము అని చెప్పగలగటం, అటువంటి ఆత్మీయత, ధైర్యం ఇవ్వగలిగితే చాలు. ప్రజలు ఆశించేది అదే. కాని అది కూడా ఇవ్వటం విఫలం అయినప్పుడు ప్రజలు జేజేలు కొడతారేమో కాని ఓట్లు వెయ్యరు. గత ఎన్నికల్లో జరిగింది అదే. చంద్రబాబు భరోసా ఇవ్వగలరు అని నమ్మిన వారు బాబు కి జై కొట్టారు, ఓట్లు వేసారు.ఇప్పుడు చంద్రబాబు పడే తపన అంతా తన మీద ఉన్న భరోసాని నిజం చెయ్యటమే.జగన్ పార్టి కి ఆ విశ్వసనీయత అనేది పూర్తిగా లోపించింది అనేది నిర్వివాదాంశం. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ప్రజల్లోకి బలం గా వెళ్ళింది మొన్న పార్లమెంట్ సమావేశాల తర్వాత. ఇక ఇప్పుడు జరిగిన దాన్ని చూస్తె…

వైకాపా నేతలు పూనూరు గౌతం రెడ్డి, వంగవీటి రాధాకృష్ణ మద్య వివాదం గుర్తుందా? పూనూరు గౌతమ్ రెడ్డి, వంగవీటి రంగా మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తే, వంగవీటి రాధాకృష్ణ దానికి తీవ్రం గా స్పందించారు. వెంటనే వైకాపా స్పందించి గౌతమ్ రెడ్డి ని పార్టి నుంచి సస్పెండ్ చేసింది. ఇది ఈ ఎపిసోడ్ లో పార్ట్ 1. విజయవాడ వచ్చిన ప్రతి సారి వైకాపా ముఖ్య నేతలు విజయ సాయి రెడ్డి, బొత్సా లాంటి వారు గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆతిధ్యం తీసుకుంటున్నారు అని, పార్టి నేత తో ఉన్నట్టే ఉంటున్నారు అనేది రాధాకృష్ణ ప్రధాన ఆరోపణ. కేవలం గౌతమ్ రెడ్డి కి ఇస్తున్న ప్రయారిటి వల్ల, వైకాపా లో వేరే కులాలకి ప్రాతినిధ్యం కాని, ప్రాధాన్యత కాని లేదని సన్నిహితుల దగ్గర రాధా వ్యాఖ్యానించారట. ఇది ఈ ఎపిసోడ్ లో పార్ట్ -2. తర్వాత సస్పెండ్ అయ్యాడు అనుకున్న పూనూరు గౌతమ్ రెడ్డి వెళ్లి పాదయాత్ర లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని కలవటం, ఆయనతో ముచ్చటించటం, ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవటం జగన్ తో చాలా సేపు ఉండటం ఈ ఎపిసోడ్ లో పార్ట్ 3, చాలా ముఖ్య అంకం. ఈ పార్ట్ 3 తో చాలా మందికి స్పష్టత వచ్చింది, పూనూరు గౌతమ్ రెడ్డి ని….

సస్పెండ్ చేసాము అని చెప్తున్న నేత ఇంటికి పార్టి ముఖ్యులు వెళ్తున్నారు అనే రాధాకృష్ణ ఆరోపణలు నిజమే అని. గౌతమ్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి కలయిక రోజున విమర్శలు వెల్లువెత్తాయి. వైకాపా కార్యకర్తలే తమ పార్టి స్ట్రాటజీ లేకుండా చేస్తున్న రాజకీయాలకు బిత్తర పోయారు. ఒక్క సారి సస్పెండ్ అయ్యాక, మళ్ళి పార్టి లో ఉన్నట్టు జగన్ మోహన్ రెడ్డి ని కలవటం ఏంటి? టివి చర్చల్లో తమ పార్టి తరపున పాల్గోవటం ఏంటి? అని, అదే విషయాన్ని బహిరంగం గా సోషల్ మీడియా వేదిక గా వెళ్లగక్కారు. ఆ రోజు నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. తాజా గా ఆ వివాదాన్ని చల్ల పరచటానికి వైకాపా ఎంచుకున్న మార్గం చుస్తే వీళ్ళు అధికారం లోకి వచ్చే అవకాశమే లేదు అని 101% ఘంటా పధం గా చెప్పొచ్చు. అసలు పూనూరు గౌతమ్ రెడ్డి సస్పెండ్ అయ్యాడని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలియ చేసారు.అంతే కాక మాకు ఆ వ్యక్తీ కి సంభందం లేదు అని తెలియ చేసారు. ఈ ప్రెస్ నోట్ చూసి వైకాపా అభిమానులే జుట్టు పీక్కుంటున్నారు. అసలు వీళ్ళకి వ్యూహం అనేది లేదని, రోజు రోజు కి పతనం చేస్తున్నారని పార్టి ని వాపోతున్నారు. వారం క్రితం పార్టి అధినాయకుడిని….

కలిసిన నేత కి వారం తర్వాత సస్పెండ్ ఎలా అవుతారని, అసలు జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. జనం లో నమ్మకం పోతున్న వైకపా అధికారం లోకి ఎలా వస్తుంది. 2014 కంటే దయనీయం గా తయారయ్యింది ఆ పార్టి పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర చేస్తున్నా, జనం లో విశ్వాసం లేకపోతె గెలవటం జరిగే పని కాదు.

Advertisements

Leave a Reply