జనసేనను దెబ్బతీసి అయినా YCP ని గెలిపించేలా BJP భారీ స్కెచ్, అమిత్ షా చెప్పిన ప్లాన్ ఇదే

Advertisements

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జనసేన కు నష్టం చేసి అయిన వైకాపా ను గట్టెక్కించటమే బిజెపి వ్యూహంలా కనిపిస్తుంది.బిజెపి తాజా ఎత్తుగడలతో జనసేనకు సమస్య తప్పేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రయోజనాలకు తప్పక నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది.అదే జరిగితే దాని వల్ల వైకాపాకి ప్రయోజనం దక్కుతుందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ బీజేపీ వ్యవహారాలలో కాపులకు పెద్ద పీట వేసారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణకు, ఎన్నికల బాధ్యతను సోము వీర్రాజుకి బీజేపీ అప్పగించింది. తద్వారా కాపు వర్గం ఓట్లకు గేలం వేయవచ్చని భావిస్తోంది. తద్వారా కాపుల ఓట్లు జనసేన వైపు మళ్లుతాయని ఆశిస్తున్న వారికి ఆశాభంగం తప్పేలా లేదు. దాంతో కాపుల ఓట్లలో చీలిక వస్తే జనసేన అధికార ఆశలకు గండిపడుతుంది. ఆ మేరకు వైసీపీ లాభపడుతుంది. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో కాపు ఓట్లను భారీగా తెలుగు దేశం దక్కించుకుంది. ఎన్నికల్లో ప్రయోజనం కూడా పొందింది. కానీ ప్రస్తుతం కాపు సామాజికవర్గ ఓట్లు జనసేనకు మళ్లితే, జనసేన కొంత ప్రభావం చూపగలుగుతుంది. కానీ తాజాగా బీజేపీలో కాపులకు మంచి స్థానం దక్కుతున్న నేపథ్యంలో కాపు ఓట్లు చీల్చటం ద్వారా తెలుగు దేశానికి భారీగా, జనసేనకు కూడా బాగానే నష్టం వాటిల్లుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో కాపుల ఓట్లు చీలిక మూలంగా టీడీపీ, జనసేన నష్టపోగా వైసీపీ పరోక్షంగా లబ్ధి దక్కించుకుంటుందని పరిశీలకుల అంచనా. బీజేపీ అధిష్టానం నిర్ణయం వెనుక కూడా అదే ప్రధాన కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. జనసేనకు నష్టం చేసి అయినా, తెలుగు దేశానికి నష్టం చెయ్యాలని, తద్వారా జగన్ ప్రయోజనం దక్కించుకునే వ్యవహారం ఆచరణలో కనిపిస్తే కన్నా లక్ష్మీనారాయణ నేరుగా కండువా కప్పుకోవడం కన్నా, కాషాయ జెండా ద్వారానే జగన్ కి ఎక్కువ మేలు చేసినట్టు అవుతుంది అనే అమిత్ షా జగన్ ని ఒప్పించి కన్నా చేరికను ఆపారని సమాచారం.

Advertisements

Leave a Reply