BREAKING : బిజెపి వీడతాను అన్న హరిబాబు? నచ్చచెప్తున్న హై కమాండ్ : బిజెపి లో భారీ కుదుపు

ఆంద్ర ప్రదేశ్ కోసం రాష్ట్ర బిజెపి లో వేరే ఎజెండా లేకుండా పోరాడిన నాయకుడు హరిబాబు అని అందరికి ఒక మంచి అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ భార్య, వైఎస్సార్ పార్టి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పై షుమారు లక్ష ఓట్ల ఆధిక్యం తో గెలిచిన హరిబాబు ఆది నుంచి వివాద రహితుడు గా ఉన్నారు. చాలా సౌమ్యం గా మాట్లాడే హరిబాబు కి రాష్య్ర ప్రజల్లో మంచి పేరు ఉంది, అలాంటి హరి బాబు గత నెలలో విజయవాడ లో జరిగిన పార్టీ సమావేశం లో కృష్ణా జిల్లాకు చెందిన ఒక చోటా నేత ఏకవచనం తో మాట్లాడారు. అప్పుడే కాస్త మనస్తాపానికి గురి అయిన హరి బాబు, పార్టి వీడుతారు అని ప్రచారం జరిగినా వెంటనే సమసి పోయింది. అయితే తాజాగా

కేంద్ర ప్రభుత్వం తప్పులు ఎంత సమర్ధించుకుంటూ వస్తున్నా, బిజెపి ఉనికి ప్రశ్నార్ధకం అయ్యేలా చేస్తున్నారని ఎన్నో సార్లు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు హరి బాబు. కాని కేంద్రం నుంచి ప్రతి సారి మొండి చెయ్యి వచ్చింది.ఇక్కడ రాష్ట్ర ప్రజల వేడి నుంచి పార్టి ని కాపాడుకుంటూ, మరొక పక్క కేంద్రాన్ని ఒప్పిస్తూ చాలా మధన పడ్డారు హరిబాబు. రాష్ట్రం లో వార్డ్ మెంబర్ గా కూడా గెలవని నాయకులు, డిపాజిట్స్ కుడా రాని పిల్ల ఎమ్మెల్యే అభ్యర్ధులు తలా తోకా లేకుండా ఎంత ఎగిరినా కట్టడి చెయ్యటం లేదు అనే ఒక అపవాదు తప్ప ఆయన మీద వేరే విమర్శలు ఏమి లేవు. రాష్ట్రం కోసం పోరాడుతున్నారు అనే అభిప్రాయమే ఉంది. అయితే ఆయన విశాఖ రైల్వే జోన్ ని చాల ప్రతిష్టాత్మకం గా తీసుకున్నారు. ఎలా అయినా సరే విశాఖ రైల్వే జోన్ వస్తుంది అని చెప్ప్తూనే వచ్చారు. నిన్న జరిగిన కోఅర్ కమిటీ మీటింగ్ లో సైతం అదే మాట గట్టిగా చెప్పారు. అంతే కాక అక్కడ నుంచి ఎమ్మెల్యే గా ఉన్న విష్ణు కుమార్ రాజు సైతం రైల్వే జోన్ మీద నమ్మకం గా ఉన్నారు. హరి బాబు వైజాగ్ లో ఎక్కడికెళ్ళిన రైల్వ్ జోన్ గురించి అడుగుతున్నారని గతం లో ఒక సారి చెప్పారు. కాని ఇప్పుడు కనీసం తమకి ఒక్క మాట కూడా చెప్పకుండా తమకి చెప్పి వెంటనే మీడియా కి రైల్వే జోన్ కుదరదు అని కేంద్రం ప్రకటించటం తో హరిబాబు బాగా బాధ పడ్డారని తెలుస్తుంది. ఈ నేపధ్యం లోనే ఆయన పార్టి ని వీడుతున్నట్టు అందుబాటులో ఉన్న కేంద్ర నాయకులకి చెప్పారని, అయితే కేంద్ర నాయకులు బుజ్జగిస్తున్నారని సోషల్ మీడియా లో న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఈ ప్రచారం అంతా రాష్ట్ర అధ్యక్ష పదవి ని ఆశిస్తున్న మరొక వర్గం పని అని హరి బాబు వర్గం చెప్తుంది. అయితే ఈ వార్త కి రాజమండ్రి కేంద్రమా అంటే చెప్పలేని పరిస్థితి. గతం లో ఇలానే హరిబాబు తెలుగు దేశం లోకి వస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ వార్తలే నిజం యాతే రాష్ట్ర అధ్యక్షుడు పార్టి ని వీడటం బిజెపి గట్టి దెబ్బ అవుతుంది కదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here