గుంటూర్ జిల్లాలో, ఈ TDP ఎమ్మెల్యే పార్టి మారదాం అని చూస్తున్నారా? కారణం ఏంటి?

Advertisements

మాములుగా ప్రతి పక్షం లో ఉన్న నాయకులు అధికార పక్షం లోకి రావాలని చూస్తూ ఉంటారు, అది సహజం. కాని అధికారం లో ఉన్న ఒక ఎమ్మెల్యే పార్టి మారదామ్ అని చూస్తుంటే అది ఆలోచించాల్సిన విషయమే. కొద్ది కాలం గా పార్టి కార్యక్రమాలకి దూరం గా ఉంటూ వస్తున్న ఆ ఎమ్మెల్యే లో కాస్త అసంతృప్తి గూడు కట్టుకుని ఉందట.అయితే అతని అసంతృప్తి తెలిసినా పార్టి అధినేత కూడా ఏమి చెయ్యలేని పొజిషన్…వివరాల్లోకి వెళ్తే…

గతం లో నరసరావుపేట ఎంపి గా గెలిచి,తర్వాతి కాలం లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు మోదుగుల వేణుగోపాల రెడ్డి. అనూహ్య పరిస్థితుల్లో రాయపాటి సాంబశివరావు తెలుగు దేశం లో చేరటం తో ఆయనకి తన ఎంపి సీట్ ఇచ్చి చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ నుంచి పోటి చేసారు గెలిచారు.అయితే చంద్రబాబు ఆదేశాలు పాటించినందుకు గాను తనకి రెడ్డి సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవి వస్తుంది అని ఆశించారు. కాని తోలి సారి కుల సమీకరణాల వల్ల ఒక జనరల్, ఒక ఎస్ సి కి మంత్రి పదవులు ఇచ్చారు. జనరల్ కోటా లో ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి పదవి పొందారు.మంత్రి పదవి రాని మోదుగుల గత ఏప్రిల్ లో జరిగిన మంత్రి వర్గ విస్తరణ లో అయినా పదవి వస్తుంది అని ఆశించారు. కాని ఈ సారి కూడా ఆయనకీ మొండి చెయ్యే చూపించారు చంద్రబాబు. చంద్రబాబు తన త్యాగాన్ని గుర్తించట్లెదు అని వాపోతున్నారట. అంతే కాక నియోజకవర్గం లో ఆయన్ని పెద్ద పట్టించుకోవట్లేదట.మిర్చియార్డు చైర్మ‌న్ ప‌ద‌విని తాను చెప్పిన వాళ్ల‌కు ఇవ్వ‌లేదని బాగా దిగులు చెందారట మోదుగుల. ఎంపి సీట్ త్యాగం చేసినా తనకి పెద్ద ఉపయోగం లేకపోవటం, గుర్తింపు లేకపోవటం బాధించాయి అట.అదే మాట తన సహచరుల దగ్గర చాలా సార్లు అని నిర్వేదానికి గురి అయ్యారట. పార్టి లో ఉన్నా కూడా పార్టి కార్యక్రమాలకి దూరం గానే ఉంటున్నారట, అంతే కాక రుణ మాఫీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయ్. ప్రభుత్వ పధకాల మీద విమర్సలు కూడా చేసారు. మొదుగుల బాధ చంద్రబాబు కి అర్ధం అయినా ఏమి చెయ్యలేని పరిస్థితి. మోదుగుల కూడా వైకాపా మునిగిపోయే నావ అని ఈ మధ్య రియలైజ్ అయ్యి, పార్టి లోనే విపక్షం గా ఉంటున్నారు.రాయపాటి తప్పుకుంటాను అనటంతో నరసరావుపేట కి తిరిగి వెళ్ళటానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారభించారు. వ్యాపారం లో ఉన్న తనకు ఎంపి అయితే బెటర్ అనేది మోదుగుల ఆలోచన గా ఉంది.

Advertisements

Leave a Reply