చంద్రబాబు బావిలో దూకాలి అని జగన్ దేనికో అన్నాడో తెలిస్తే కోపం రాదు నవ్వుకుంటారు

Advertisements

చంద్రబాబు రాజకీయాలని అన్ని దిక్కుల నుంచి చూసేసారు. ఆయన రాజకీయ అనుభవం అంత వయసు లేని జగన్ చేసే పనులు ఒక్కో సారి నవ్వు తెప్పిస్తు ఉంటాయ్. చిన్న పిల్లోడిలా ఉక్రోషం కుడా చూపిస్తూ ఉంటాడు జగన్. తాజాగా చంద్రబాబు ని బావిలో దూకాలి అని వ్యాఖ్యలు చేసాడు జగన్ మోహన్ రెడ్డి. సాధారణ ప్రజలు సైతం ఈసడించుకున్నారు. జగన్ ఈ బాష మార్చుకోకపోతే కష్టం అనే భావన అందరిలో ఉంది. అయితే జగన్ మోహన్ రెడ్డి అంత ఆవేశం గా స్పందించటానికి కారణం కూడా ఉంది. అయితే ఆ కారణం వెనుక చంద్రబాబు అపార అనుభవం కనిపిస్తే, జగన్ అనుభవలేమి కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే…

ఎపి భవన్ విషయంలో జగన్ కి చంద్రబాబు ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ కొట్టింది. అందుకే చంద్రబాబు బావిలో దూకాలనే వ్యాఖ్యలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో కలిసి పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీ, తన ఎంపీలతో రాజీనామాలు చేయించింది,దీనితో రాజకీయం కాస్త వేడెక్కినట్టే కనిపించింది. కానీ ఆమోదింప చేసుకోవడంలో వెనుకంజ వేసింది. ఆ తర్వాత వెంటనే వారు దీక్షకు కూడా కూర్చున్నారు. ఆ దీక్షకి సంఘీభావం గా రోజా లాంటి ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్ళగానే గాలి దుమారంతో దీక్షా శిబిరం కూలిపోయింది. ఇదిలా ఉండగానే తెలుగుదేశం ఎంపీలు ప్రధాని లక్ష్యంగా నిరసనలు చేశారు, పార్లమెంటులో కూడా ప్రధాని ఉన్నప్పుడే ఆయనకీ వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ప్రతిపక్షం మాత్రం ప్రధానికి ఎక్కడా నొప్పి తగలకుండా చంద్రబాబు మీద పోరాటం చేశారు. పాపం వారిని చుసిన జగన్ తట్టులోక ప్రధానికి ట్విట్టర్ లో సున్నితంగా ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. అయ్యా దయచేసి కాస్త మా ఇబ్బంది చూడండి అని. ఇది నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎపి భవన్ లో నిరాహార దీక్షకు దిగారు. అయితే ఇక్కడ ఎపి భవన్ విషయంలో మాత్రం జగన్ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఎపి భవన్ అనేది ప్రభుత్వ భవనం. అక్కడ విపక్షం దీక్ష చేస్తే చంద్రబాబు అనుమతి ఇవ్వరని జగన్ భావించారు.

అందుకే ఎపి భవన్ ని ఎంచుకున్నారు వ్యూహాత్మకంగా.. ప్రధాని నివాసం దగ్గరో లేక పార్లమెంటు దగ్గరో లేక మరెక్కడైనా బహిరంగ ప్రదేశంలో దీక్ష చేస్తే మరింత ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద వచ్చేది. కానీ ప్రధానికి ఇబ్బంది లేకుండా కేవలం చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి వైకాపా ఎపి భవన్ ని దీక్షకు ఎంచుకుంది. అక్కడ చంద్రబాబు అనుమతి ఇవ్వకపోతే చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చి ఉండేది. కాని ఇది ముందే గమనించిన ముఖ్యమంత్రి దీక్షకు అడగకుండానే అనుమతి ఇచ్చారు. అనుమతి మాత్రమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. అంతేనా రాష్ట్రం కోసం ఎవరు పోరాడినా, కలుపుకుని వెళ్తాం, సహకరిస్తాం అని తెలియ చేసారు. మీకు గుర్తుందా ఇదే ఏపి భవన్ అధికారులు చంద్రబాబు గతం లో డిల్లీలో నిరాహారదీక్ష చేసిన సమయంలో సహాయ నిరాకరణ చేశారు. పనివేళలు ముగిసాక కనీసం టాయిలెట్లు ఉపయోగించుకోటానికి కూడా అవకాశం లేకుండా తాళాలు వేసుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా కాకుండా వైకాపా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా లోపల దీక్ష చేసుకునే వెసులుబాటు కల్పించారు. వారికి దీక్ష విరమించుకునే అవకాశం లేకుండా చేశారు. దీనితో ఉక్రోషం పట్టలేక మీడియా సమావేశం పెట్టి చంద్రబాబుని విమర్శించారు, చంద్రబాబు కొట్టిన దెబ్బ తట్టుకోలేకే చంద్రబాబు దూకాలి అంటూ విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం


పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చి చంద్రబాబు హీరో అయితే, అంత సహకరించిన చంద్రబాబు బావిలో దూకాలి అని విమర్శించి ప్రజల్లో జగన్ చులకన అయ్యాడు. ఇలాంటి సెల్ఫ్ గోల్స్ చూసే నవ్వు వచ్చేది.

Advertisements

Leave a Reply