DJని అవసరానికి మించి కామెంట్ చేసామా? ఇందులో ఉన్న మంచి వదిలేశామా?

Advertisements

పోయినేడు జూన్ 23 న దువ్వాడ జగన్నాథం రిలీజ్ అయినప్పుడు కొందరు బావుందని, మరికొందరు పర్లేదు అని, ఇంకొందరు అదిరిపోయిందని అన్నారు. మన సినిమాల్లో బ్రాహ్మణ కారక్టర్లు హీరో గా చేసినవి తక్కువ కాబట్టి ఎన్టీఆర్ అదుర్స్ తో పోలిక వచ్చింది కూడా. అదుర్స్ లో ఎన్టీఅర్-బ్రహ్మి కాంబో భట్టు-చారి గా పండించిన కామెడి ఇప్పటికి ఎవర్ గ్రీన్. అలా చుస్తే డిజే లో హీరో కారక్టర్ కి కామెడి ఉండదు ఒక కాజ్ ఉంటుంది.

తప్పు ని చుస్తే కోపం కట్టలు తెంచుకుంటుంది.అలాగే పెరిగి పెద్దవుతాడు, తప్పు చేసిన వాళ్ళని డిజే గా చంపుతూ ఉంటాడు, ఇది ఆ కారక్టర్ లో ఒక కోణం.ఇదే డిజే దువ్వాడ జగన్నాథం గా ఒక సాధారణ బ్రాహ్మణ యువకుడిగా, కుటుంబానికి విలువ ఇచ్చే ఒక సాధారణ యువకుడి గా కనిపించటం రెండో కోణం. డిజే మంచి మాటలు చెప్తే మనం వినము, అలానే దువ్వాడ జగన్నాథం పంచ్ డైలాగులు చెప్తే మనమే నవ్వుతాం. వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఎక్కువ ద్వేషించబడింది,అవి అప్రస్తుతం.కాని ఇక్కడ ఒక చిన్న ఆలోచన,ఒక సినిమా ఆ సినిమా హీరోదో,దర్సకుడిదో కాదు, తెరవెనుక ఉన్న వందల మంది జీవితం అది,వాళ్ళ శ్వాస, వాళ్ళ భరోసా అది, దానికి కాలరాసే హక్కు ఎవరికీ లేదు, రాదు. డిజే విషయానికి వస్తే నైజాం లో ఆ రోజు కి 22 కోట్ల కలెక్షన్ ఒక రికార్డు. రివ్యూలు సహకరించలేదు, పని కట్టుకుని చేస్తున్న నెగెటివ్ టాక్ ఒక పక్కన, కాని కలెక్షన్స్ ఆగలేదు. హిందీ లో 100మిలయన్ వ్యూస్ దాటింది యు ట్యూబ్ లో…. అప్పటికి కొన్ని చోట్ల చాలా తక్కువ మొత్తాల్లో నష్టాలు వచ్చాయని దిల్ రాజు ఒక సందర్భం లో చెప్పారు. కాని ఇక్కడ కలెక్షన్స్ కొలమానం గానో,సినిమా రేంజ్ స్కేల్ గానో పెట్టుకుని మాట్లాడట్లేదు. డిజే ని హేట్ చెయ్యొచ్చు, దువ్వాడ జగన్నాథం ని ప్రేమించకుండా ఉండలేరు. దురదృష్టవశాత్తు మనకి ద్వేషం అనే నెగెటివ్ ఎమోషన్ ఎక్కువ ఇష్టం కాబట్టి, ప్రేమ అనే పాజిటివ్ ఎమోషన్ ని వదిలేసాం. డిజే లో ఉన్న కొన్ని మంచి డైలాగ్స్ ఇవిగో….

మీరు అత్తా మామలు గా ఉన్నంత కాలం తానూ కోడలు గానే మిగిలి పోతుంది, మీరు అమ్మా నాన్నా లాగా ఆలోచిస్తే తనూ కూతురు లా కనిపిస్తుంది.

అప్పుడు అమ్మా అన్న కొడుకు.. ఇప్పుడు మమ్మీ అనొచ్చు…అప్పుడు ఉత్తరం రాసిన కూతురు …ఇప్పుడు ఈమెయిల్ పంపొచ్చు, బాష మారినా భావాలు మారలేదు బాబాయ్

కావాల్సిన వాళ్ళ కళ్ళు చుస్తే చాలు, కష్టం తెలిసిపోతుంది.

పద్దెనిమిదేళ్ళ అమ్మాయి కి పదేళ్ళ కుర్రాడిని తోడిచ్చి పంపుతున్నారు ఇలానే పంపండి ఆడ పిల్లల్ని

టెక్నలాజి వచ్చాక మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది ఏంటి, తగ్గాలి కాని?

నేను నీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, పెద్ద బాలశిక్ష చదువుకున్నా

మనం చేసే పనిలో మంచి కనపడాలి కాని,మనిషి కనపడక్కర్లేదు

ఇవే కాకుండా “పబ్బుల్లో వాయించే డిజే కాదు రా పగిలిపోయేలా వాయించే డిజే” లాంటి మాస్ మసాల డైలాగ్స్ ఉన్నాయ్

బెజవాడ అంటేనే పైన అమ్మవారు, కింద కమ్మ వారు లాంటి తుంటరి డైలాగ్స్ ఉన్నాయ్

సరే కాసేపు డైలాగ్స్ పక్కన పెట్టి సినిమా విషయానికి వద్దాం.ఇదేదో మంచి సందేశాత్మక చిత్రం అనో, సమాజాన్ని ఉద్దరిస్తాం అనో ఎక్కడ దర్శక నిర్మాతలు చెప్పలేదు. ఇది ఒక ఎంటర్టైనర్ అన్నారు. ఎంటర్తైన్మెంట్ అంటే కామెడినే అనే తప్పు అభిప్రాయం మనకు ఉంది. కాని నిజానికి ఎంటర్తైన్మెంట్ అంటే ఒక పాట చూసినా, ఒక ఫైట్ చూసినా, ఒక డాన్స్ చూసినా, ఒక డైలాగ్ విన్నా మనం ఎంటర్టైన్ అయితే అది ఎంటర్తైన్మెంట్. అలా ఎక్కువ సార్లు ఎంటర్టైన్ … అయితే అదొక టాప్ ఎంటర్టైనర్. అలా చుస్తే డిజే లో అన్ని ఉన్నాయి.సాంగ్స్ బావున్నాయి, ఫైట్స్ బావున్నాయి,పైన చెప్పినట్టు డైలాగ్స్, అందమైన హీరోయిన్, కావల్సినంత ఎమోషన్ అన్ని ఉన్నాయ్. ఆ సినిమా దేనికి తీసారో ఆ పర్పస్ సాల్వ్ అయ్యింది. హెట్ చేసిన వాళ్ళు ఉడుక్కునేలా, ప్రేమించిన వాళ్ళు గర్వించేలా.

ఇప్పుడు సడెన్ గా డిజే గురించి దేనికి అనేది మీ ప్రశ్న అయితే, నిన్న రాత్రి మళ్ళి డిజే చూడటం జరిగింది,అంతే….

Advertisements

Leave a Reply