పవన్ కళ్యాణ్ జంధ్యం దేనికి ధరించారో తెలుసా?

Advertisements

పవన్ కళ్యాణ్ జంధ్యం దేనికి ధరించారు అన్ని ప్రశ్న ఊపందుకుంటుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని ఆరా తీస్తే అజ్ఞాతవాసిలో ఆఫీస్ ఎపిసోడ్స్‌లో వచ్చే జనరల్ బాడీ మీటింగ్ సన్నివేశం ఈ ‘జంధ్యం’ ప్రచారానికి ప్రారంభం అంటున్నారు.ఆ సన్నివేశంలో పవన్ టీషర్టులో కనిపిస్తారు. ఆ టీ షర్ట్ నుంచి జంధ్యం లీలగా కనిపించింది అని కొందరు అభిమానులు వారి వారి వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకున్నారట. ఆ చర్చలు కాస్త బయటకి రావటం తో దేనికి అని ఆత్రుత అందరికి కలిగింది. దేనికి అని కనుక్కోతం తప్పు కాదు కాబట్టి, తెలుసుకోవాలి అనుకున్నవారికి,మేము సేకరించిన కొన్ని వివరాలు…

పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ తనకు చాలా ఆప్తుడని, ఆయన ప్రభావం తన మీద ఉంటుందని గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఐతే త్రివిక్రమ్‌కు దైవ చింతన ఎక్కువ. ఈ రోజుకి కూడా ఆయన మూడు సంధ్యలలోనూ సంధ్యా వందనం తప్పకుండా చేస్తారని అంటారు. ఆధ్యాత్మికంగా కూడా ఆయన గురువుల సలహాలను పాటిస్తారు. త్రివిక్రమ్ ద్వారా ఆ గురువులు పవన్ కి పరిచయం అయ్యారట.సాధారణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాల్లోనే జంధ్యం ధరించాలీ.కాని పవన్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడే అయినప్పటికీ, త్రివిక్రమ్ ఉపదేశం మేరకు ఆయన కూడా జంధ్యం ధరించారన్న ప్రచారం జరుగుతోంది.అంతే కాకుండా పవన్ గతం లో నాకు కులం లేదు అని జనసేన మీటింగుల్లో చెప్పనా విషయాన్ని చెప్తున్నారు.ఐతే పవన్ జంధ్యం ధరించాడా లేదా అనే చర్చ గతంలో గోపాలా గోపాలా చిత్ర షూటింగ్ సమయం లో తన అభిమానిని కలిసినప్పటి ఫొటోస్ (పైన ఉన్న ఫోటోస్ అవే) బయటకి వచ్చినప్పుడే వచ్చింది. కాని మళ్ళీ ఇన్నాళ్ళకు అజ్ఞాతవాసి లో సీన్ వల్ల మళ్ళి డిస్కషన్ లోకి వచ్చింది. అంటే గోపాలా గోపాలా ముందు వచ్చిన అత్తారింటికి దారేది సమయం లోనే ధరించారా అనేది అభిమానులు చర్చించుకుంటున్నారు. బ్రాహ్మణులు యజ్ఞోపవీతంగా భావించే జంధ్యం విశిష్టత గురించి పవన్ కల్యాణ్‌కు ఆసక్తి కలగటం వల్లే ఆయన దానిని ధరించినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది కొంచెం కొత్తగానే ఉంది కదూ. నన్ను ఒక కులానికి పరిమితం చెయ్యకండి అని పవన్ దీనివల్లనే అంటారా? ఏమో?

 

Advertisements

Leave a Reply