FULL DETAILS : శ్రీరెడ్డి వెనుక ఉన్నది ఎవరు? మొత్తం టార్గెట్ ఎంత? లిస్టులో ఉన్నది ఎవరు?

Advertisements

తెలుగు సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది అని కొన్ని నెలల క్రితం గాయత్రి గుప్తా అనే నటి లేపిన రచ్చ చల్లారక ముందే, శ్రీ రెడ్డి అని ఇంకొక నటి తెర మీదకు వచ్చింది. తనకి జరిగిన అనుభవాలు చాలా బోల్డ్ గా చెప్తుంది. ఆమె చెప్పే మాటలకి టీవీ ఛానెల్స్ రేటింగ్స్ విపరీతంగా పెరుగుతుంది. యు ట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్, గడిచిన వారం రోజులుగా టీవీలు, యూట్యూబ్ ఛానెళ్లు జపిస్తున్న ఏకైక పేరు శ్రీరెడ్డి. వల్గర్ అనుకోండి, బోల్డ్ అనుకోండి, సిగ్గు లేనిదనుకోండి..మరేదైనా అనుకోండి..శ్రీరెడ్డి ఇంటర్వ్యూ మాత్రం జనానికి వినోదాన్నిస్తోంది, సినిమా ఇండస్ట్రీకి చెమటలు పట్టిస్తోంది.

అసలెందుకు శ్రీరెడ్డి టీవీలకెక్కింది..? చాలా మందిని ఇప్పుడు వెంటాడుతున్న ప్రశ్న ఇదే. ఇంటర్వ్యూలివ్వడం వలన ఉన్న సినిమా అవకాశాలు కూడా పోతాయి. ఇక ఎవ్వడూ శ్రీరెడ్డిని టచ్ కూడా చేయడు. మరి ఏ ధైర్యంతో శ్రీరెడ్డి ఇంతమంది కి ఎదురుగా పోరాడుతుంది లేదా కనీసం ట్రై చేస్తోంది..? ఆమె తీరు అర్ధం కాక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.అసలు విషయమేంటా అని ఆరా తీస్తే శ్రీరెడ్డి వెనుకాల ఒక ఇండస్ట్రి పెద్ద ఉన్నట్టు తెలుస్తుంది.ఆయన సినిమా తీసి పదేళ్ళు దాటిపోయింది, ఇప్పటికి కూడా సినిమా పెద్దగా చలామణి అవుతూ, తెలిసి తెలీని అన్ని టాపిక్స్ లో స్పందిస్తూ ఉంటారు. గత రెండు మూడు వారాలు గా ఎక్కువగా వినపడుతున్నా సదరు వృద్ద నిర్మాత భారీ ప్లాన్ తో శ్రీరెడ్డి వెనుకాల ఉన్నారట. ఆయన ఒక పొలిటికల్ పార్టి ఫాన్ నీడలో ఉన్నారని అందరికి తెలిసిన విషయమే శ్రీరెడ్డి గట్టిగా నాలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేయలేదు. నటన ద్వారా గట్టిగా పదిలక్షలు సంపాదించిన సందర్భాలు కూడా లేవు. కానీ శ్రీరెడ్డి మెయింటెయినెన్స్, ఆమె ఉంటున్న ఇల్లు, ఇవన్నీ చూస్తే అసలు సినిమాల్లో ఛాన్సులే దక్కని ఈ అమ్మాయికి ఇంత హెవీ మెయింటెనెన్స్, ఇంత రిచ్ హౌస్ ఎలా సాధ్యమైంది అనిపిస్తుంది. అసలు ఏ సంపాదనా లేకుండా ఆమెకు ఎలా ఇంత రిచ్ గా మెయింటెయిన్ చేస్తుందో ఎవరికీ అర్ధం కాని మిస్టరీ. తీగలాగితే చాలా సమాచారం వచ్చింది. శ్రీరెడ్డికి సినిమాల్లో


అవకాశాలు ఇంతకు ముందు రాలేదు, ఇంత రచ్చ జరిగాక ఇకపై రావు కూడా. కానీ, అంతకు మించి బొనాంజా ఆమెకు దక్కబోతోంది. తెలుగమ్మాయిలకు అవకాశాలివ్వరా..? పడుకుంటే కానీ అవకాశాలు రావా..? టీవీ ఛానెళ్లకెక్కిన శ్రీరెడ్డి అసలు టార్గెట్ కొందరు ప్రముఖుల నుంచి భారీగా డబ్బు గుంజడమే. ఒక ప్రముఖ నిర్మాత కొడుకు, ఒక క్రియేటివ్ సీనియర్ దర్శకుడు, ఒక కామెడీ హీరోతో పాటు కొందరు సినీప్రముఖులు శ్రీరెడ్డి ఉచ్చులో చిక్కారు. ఆమెకు సినిమా అవకాశాలు ఇప్పిస్తామనో, ఇంకేవేవో ఆశలు చూపి తమకు కావాల్సిన సుఖాన్ని తీసుకున్నారు.అయితే, ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని చదివేసిన శ్రీరెడ్డి, తనతో పడుకున్న ప్రముఖుల మొబైల్ ఛాటింగ్స్, వీడియోలు, ఫొటోలు, తనతో కలిసున్నప్పటి వీడియా క్లిప్పింగ్స్ జాగ్రత్త చేసి పెట్టిందట. ఇప్పుడు ఆ వీడియోలనే చూపించి, భారీగా పెనాల్టీ కట్టించే పనిలో ఉంది శ్రీరెడ్డి. ఇందుకోసం, ఒక మెరుగైన న్యూస్ ఛానెల్ ను కూడా రెడీ చేసి పెట్టుకుంది. శ్రీరెడ్డితో సంబంధం ఉండి, సీక్రెట్ కెమేరాలకు చిక్కుకుపోయిన ఈ ఏడెనిమిది మంది ప్రముఖులు చెల్లించబోయే పెనాల్టీతో ఆమె లైఫ్ లో సెటిలైపోయే ప్లాన్ వేసుకుంది. షుమారు పది కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తుంది అని చెప్తున్నారు. అందుకే ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం, టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు లేవంటూ మొదలెట్టి, పరోక్షంగా ఈ ప్రముఖులందరికీ వార్నింగ్ బెల్స్ పంపించేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు వీళ్లంతా తమ పరువు తీయద్దంటూ

శ్రీరెడ్డి వెంట పడుతున్నారట. చూడాలి..ఎవరెంత కడతారో..? అయితే ఆ అమ్మాయి ఇలా ధైర్యం గా మాట్లాడటం నిజంగా ఒక మంచి పరిణామం అని కొందరు భావిస్తున్నారు.

Advertisements

Leave a Reply