ప్రియా ప్రకాష్ వారియర్ ఎవరు? బాక్ గ్రౌండ్ ఏంటి? ఏమి చేసేది?పూర్తి వివరాలు…

Advertisements

ప్రియా ప్రకాష్ వారియర్ ఈ పేరు మీరు గత ఇరవై నాలుగు గంటల్లో ఒక్క సారి వినకపోయినా మీరు ఇంటర్నెట్ ని పెద్ద గా ఫాలో అవ్వరనే. కారణాలు ఏమైనా ఈ అమ్మాయి ఇరవై నాలుగు గంటల్లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది.నేషనల్ మీడియా లో కూడా ఈమె గురించి వార్తలు. అసలు ఎవరు ఈమె, సినీ బాక్ గ్రౌండ్ ఉందా? గతం లో ఎం చేసేది అని రకరకాల క్వశ్చన్స్ ఇంటర్నెట్ లో సెన్సేషన్ అవుతున్నాయి. చిన్న ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర వివరాలు తెలిసాయి.

గత ఇరవై నాలుగు గంటల్లో ఈ అమ్మాయి గురించి ట్వీట్లు,పోస్ట్స్, లైక్స్, షేర్స్, కామెంట్స్, డిస్కషన్, మేమేస్. వీడియో ఎడిట్స్ ఇన్ని అవుతున్నాయి.ఆ అమ్మాయి కుర్రాళ్ళకి తెగ న‌చ్చేసింది. ఆ అమ్మాయి హావభావాల‌కు, క‌నుసైగ‌లకు చాలామంది ఫిదా అయిపోతున్నారు. కొంత‌మంది ఆ అమ్మాయి ఫోటోనే త‌మ డీపీగా కూడా పెట్టుకుంటున్నారు.  కేరళలోని త్రిసూర్ లో విమలా కాలేజ్ లో చదివిన ఈ అమ్మాయి, ఫ్రెండ్స్ తో సరదాగా తిరగటం, తన అభిమాన నివిన్ పౌలి సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం, పాటలు పాడటం తనకి బాగా ఇష్టమైన పనులు అట. ఈ అమ్మాయి గతం లో మోడల్ గా చేసేది. ఈ అమ్మాయి పాడిన చన్నా మేరెయా అనే హిందీ పాత కూడా పర్సుతం వైరల్ అవుతుంది. అతి తక్కువ సమయం లో ఇన్స్టాగ్రామ లో వన్ మిలియన్ ఫాలోయర్స్ ని పొందిన మూడవ సెలెబ్రిటి గా ఆల్రేడి ఒక రికారు తన ఖాతా లో వేసుకుంది. ఈ అమ్మాయి మీద వచ్చినన్ని మేమేస్, ఫన్ని కామెంట్స్ ఈ మధ్యలో ఎవరి మీద రాలేదు అంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా సూపర్ స్టార్ అయ్యింది. ఇంతకీ ఏ క్లిప్ వల్ల ఆ అమ్మాయి సూపర్ స్టార్ అయ్యింది అని మీరు ఆలోచిస్తుంటే ఈ క్లిప్ అదే. చూడండి..

Thank you for all the love and support💙

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

మ‌ల‌యాళంలో `ఓరు ఆద‌ర్ ల‌వ్‌` పేరుతో తెర‌కెక్కుతున్న సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్‌. ఈ సినిమాలోని మాణిక్య మలరాయ పూవీ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఈ సాంగ్ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. మార్చి మూడో తేదీన ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ వీడియోనే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ట్రెండ్ అవుతోంది. అందులో న‌టించిన ప్రియ తొలి సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే సోష‌ల్ మీడియా స్టార్ అయిపోయింది.

Finally, when your best friend buys a good phone @sree_17 💜

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

I do the thing called what i want✨

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

Advertisements

Leave a Reply