SPECIAL : ఎవరు ఈ కనకమేడల రవీంద్ర కుమార్? ఆయననే దేనికి ఎంపి గా సెలెక్ట్ చేసారు?

సీఎం చంద్రబాబు అనేక సమీకరణాలను,రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాసేపటి క్రితం రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. సీఎం రమేష్‌ను మరోసారి రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే రెండవ అభ్యర్థిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. రెండు రాజ్యసభ స్థానాలకు గానూ ఓసీ, ఎస్సీ అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని టీడీపీ భావించినట్లు ,అందువల్లనే వర్ల రామయ్య పేరు ఖాయం అయినట్టు వార్తలు వచ్చాయి.ఆదివారం మధ్యాహ్నం వరకు ఆయన పేరే వినిపించింది.ఐతే అనూహ్యంగా కనకమేడల రవీంద్ర కుమార్ పెరుతెర మీదకు రావటం, ఎంపిక కావటం చక చకా జరిగిపోయాయ్. అయితే ఆయనను ఎంపిక చేసినప్పటి నుంచి ఎవరు ఈ కనకమేడల రవీంద్ర కుమార్? అనే చర్చ సాగుతుంది. వాస్తవానికి కనకమేడల రవింద్ర కుమార్ షుమారు రెండు దశాబ్దాల పైబడి పార్టిలో పని చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన…

తెలుగు దేశం పార్టి లో లాయర్ గా ఉంటూ, పార్టి కి సంభందించిన కేసులు, చంద్రబాబు కి సంభందించిన కేసులు చాలా వాదించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ పరమైన కేసులు వాదించటం లో ఈయన దిట్ట. శనివారం సీఎం చంద్రబాబుతో మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు సమావేశమయ్యారు. ఈ భేటీలో కనకమేడల రవీంద్ర పేరు ప్రస్తావనకు వచ్చింది.రవీంద్ర టీడీపీ లీగల్ సెల్‌కు కన్వీనర్‌గా, బార్‌కౌన్సిల్ మెంబర్‌గా కూడా ఉన్నారు. రవీంద్ర ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఢిల్లీ, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో టీడీపీ ఎన్నో కేసులను వాధించింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబుపై వేసిన ఎన్నో కేసులను ఆయన వాధించారు. రాజ్యాంగం మీద మంచి అవగాహన ఉన్న కనకమేడల లాంటి వ్యక్తీ రాజ్యసభ లో ఉంటె పార్టి కి చాలా మద్దతు లభిస్తుంది అని, రాజ్య సభలో తెలుగు దేశం వాణిని,ఆంధ్రుల ఆకాంక్ష ను గట్టిగా వినిపించగలరు అనే ఆయన్ని చివరి నిమిషంలో ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉన్న న్యాయవాదులు రవీంద్ర పేరును పరిశీలించాలని ముఖ్య మంత్రి కి ప్రతిపాధించారు. అంతే కాకుంగా రవీంద్ర శనివారం చంద్రబాబును స్వయంగా కలిసి తనకు రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నుకోవాలని కోరారు. అనేక సమీకరణలను సీఎం దృష్టిలో పెట్టుకుని రవీంద్ర పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఈయన అనూహ్యం గా తెర మీదకు రావటం, ఎంపిక కావటం జరిగిపోయాయి. పార్టి కి కష్ట కాలం లో అండగా నిలబడ్డ కనకమేడల రవీంద్ర కుమార్ ను ఎంపిక చెయ్యటం లో పార్టి కార్యకర్తల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here