FULL DETAILS : ప్రతి వివాదంలోను పవన్ ని దేనికి లాగుతున్నారు? వెనుక ఉన్నది ఎవరు?

గత కొద్ది రోజులుగా కాస్టింగ్ కౌచ్ అనే అంశం టాలివుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఒక నటి మొదలు పెట్టిన ఈ ఉద్యమం రోజుకి ఒక కొత్త టర్న్ తీసుకుంటుంది. అయితే ఈ విమర్శలు ఎలా ఉన్నా, అక్కడ సమస్య ఏది ఉన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ని లాగుతున్నారు అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గతం లో కత్తి మహేష్ పవన్ మీద విమర్శలు చేసి , ఆయన అభిమానులు రెచ్చిపోవటంతో గొడవ పెద్దది అయ్యింది. చివరకి కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ స్పందించాలి అని కోరారు. ఇదిలా ఉంటె


కత్తి మహేష్ వివాదం కాస్త సమసి పోయింది అన్నాక, తాజాగా మొదలయిన కాస్టింగ్ కోచ్ విధానం బాగా ముదిరాక, జనసేన అధినేత పవన్ స్పందించాలి అని కోరారు. ఆ విషయం మీద పవన్ స్పందిస్తూ ఇలాంటి వివాదాలు ఉంటె పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కాని, టివి చానల్స్ కి కాదు అని హితవు చెప్పారు. పవన్ కల్యాణ్ సలహా నాకు నచ్చలేదు. ఓ పోరాట యోధుడిగా.. సాటి పోరాటయోధురాలిని గౌరవించి ఉంటే బాగుండేది. పోరాటం నా నైతిక హక్కు. ప్రజాస్వామ్యంలో నా ఇష్టం వచ్చినట్టు నిరసన తెలుపుతాను. ఆయన కూడా పోరాటం చేస్తున్నారు. ఆయన సమస్యలపై యుద్ధం చేస్తున్నారు. నేనూ ఇండస్ట్రీలో సమస్యలపై పోరాటం చేస్తున్నాను. ఆయన మాట్లాడిన తీరు మమ్మల్ని గౌరవించినట్టు అనిపించ లేదు. పేరెత్తడం ఇష్టం లేనట్టు ఆయన మాట్లాడటం నాకు నచ్చలేదు. అన్నా.. పవన్ అన్నా అంటూ చాలా గౌరవంగా ఆయన్ను అభ్యర్థించాను. మా పోరాటానికి మద్ధతు ఇవ్వమని కోరాను. మమ్మల్ని సమర్థిస్తూ ఓ చిన్న మాట మాట్లాడమని కోరాము. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కేవలం ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమైంది. సమస్యల గురించి మాట్లాడే వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఆయన అలా మాట్లాడటం మమ్మల్ని చిన్నబుచ్చినట్టైంది అని అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉంటె సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో


మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. అయితే ఈ వేదిక మీద పవన్ ని విమర్శించారు. పవన్ అన్నా అంటూ సంభోదిస్తూనే తీవ్రంగా మండిపడింది. శ్రీరెడ్డి విషయంలో పవన్ ఇచ్చిన సలహా మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కడో నిలబడి మీడియా ముందు బిల్డప్ ఇవ్వడం కాదని, తన మాటల వల్ల ఒకవేళ పవన్‌కు కోపం వచ్చివుంటే ఆయనతో తన్నులు తినడానికైనా సిద్ధమని చెప్పింది. ఆవిడ పవన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మా బాధలు తీర్చడానికి పోలీసుల వల్ల కూడా కాదు. అప్పుడు ఏం చేయాలి. సీఎం కేసీఆర్‌ను రమ్మనండి. మీరు ముందు కూర్చోబెట్టి అమ్మా మీకు ఏం న్యాయం కావాలని అడగండి. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు. శ్రీరెడ్డి ఫిర్యాదు చేసింది. పోలీసులు న్యాయం చేయలేదు. మీరు న్యాయం చేస్తారేమో చెప్పండి. అన్యాయం జరిగిందని రోజుకు పదుల సంఖ్యలో అమ్మాయిలు వచ్చి రోడెక్కుతుంటే మీకు పట్టదా’’ అంటూ నటి పవన్‌కల్యాణ్‌‌ని ప్రశ్నించింది. అంతే కాకుండా మరొక నటి పవన్ కళ్యాన్ బెంగాలి అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటారు అని, ఆయన పాకేజీ కి అమ్ముడు పోయారని, ఆయనకీ అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అని పవన్ ని వ్యక్తిగతం గా విమర్శించింది. అయితే ఆ ఆరోపణలు నిజమా కాదా పక్కన పెడితే అసలు పవన్ కి ఈ వివాదం తో ఏమి సంభందం,


అసలు జరిగిన ప్రతి వివాదం లో పవన్ ని లాగటం వల్ల ఎవరికీ లాభం, ఫిలిం ఇండస్ట్రీ లో నలభై మంది పైగా హీరోలు ఉండగా, పవన్ ని మాత్రమె దేనికి టార్గెట్ చేస్తున్నారు అని అభిమానులు ప్రశ్నలు లేవనేత్తుతున్నారు.ఇంకెవరు స్పందించే అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గతం లో జరిగిన కత్తి మహేష్ వివాదం వెనుక, ప్రస్తుతం జరుగుతున్న వివాదం వెనుక ఒక రాజకీయ పార్టి ఉందని, పవన్ వీక్ అయితే వ్యతిరేక ఓటు ఎక్కువ చీలదు అని అందుకే పవన్ ని టార్గెట్ చేసారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే బెంగాలి అమ్మాయిలతో పవన్ మసాజులు చేయించుకుంటున్నారు లాంటి విమర్సల వల్ల కష్టపడి చేస్తున్న పోరాటం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here