ExclusivE : సవ్యసాచి లో ఎం జరుగుతుంది?

నాగచైతన్య ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎంచుకుని తనకంటూ ఒక ప్రత్యెక పంధాలో ముందుకు దూసుకుని పోతున్నాడు, కార్తికేయ, ప్రేమమ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన చందు మొండెటి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సవ్యసాచి. చైతు తో పాటు మాధవన్, భూమిక లాంటి స్టార్స్ ఉన్న ఈ చిత్రం చాలా వేగంగా తన పని తానూ చేసుకునిపోతుంది.నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ మీ కోసం.

ఈ చిత్రంలో నాగ చైతన్య కారక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ నిమిత్తం మార్చ్ నెల రెండవ వారంలో అమెరికా బయల్దేరి వెళ్తుంది చిత్ర యూనిట్. ఈ చిత్రం లో కామెడి ని, లవ్ ట్రాక్ ని పెద్ద హైలెట్స్ గా చెప్తున్నారు. అంతే కాక రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా బావున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా అభిమానుల కోసమే డిజైన్ చేసిన చైతన్య ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందని టాక్. దాదాపు ఏప్రిల్ నెల మొదటి వారం వరకు అక్కడే కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారు. అంతే కాక అమెరికాలో ఇంత వరకు ఎవరు పిక్చరైజ్ చెయ్యని లోకేషన్స్ లో సాంగ్స్ కూడా తియ్యాలి అని ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. ఆల్రడి ట్రేడ్ సర్కిల్స్ లో మంచి బాజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే విడుదల కు సిద్దం అవుతుంది. నాగ చైతన్య తన కెరీర్లో ఒక మంచి కారక్టర్ గా సవ్యసాచిని భావిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here