వెంకయ్య నాయుడు ప్రధాని అభ్యర్ధి అయితే థర్డ్ ఫ్రంట్ కి “మా మద్దతు”

అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్నా మోడీ సర్కార్ దేశానికి చేసింది ఏం లేదని స్పష్టమైంది. ప్రజలను మాటలతో మభ్యపెట్టడం మినహా మోడీ ప్రధానిగా సాధించిన విజయాలు దేశంలో ఏం లేవనేది ఎవరు కాదనలేని వాస్తవం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మోడీ తీరుతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. రాజధాని ఉన్న తెలంగాణాని పక్కన పెడితే ఎలాంటి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ మోడితో కోలుకుంటుందని భావించినా అది జరగలేదు. దీనితో ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం మంత్రులను రాజీనామా చేయించింది.అయితే ఇక్కడి నుంచి రాజకీయాలు మారుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బిజెపికి ముగింపు పలకడానికి గాను తెలుగు రాష్ట్రాల నుంచే వ్యూహాలు మొదలైయ్యాయని అంటున్నారు. ఆ వ్యూహంలో భాగమే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన అని

అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాస్త లోతుగా వెళ్లి చూస్తే,వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఎంతో కొంత న్యాయం జరిగింది. కాని ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి పంపిన ప్రధాని మోడీ ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నిధులను నిలిపివేశారు. బిజెపి , కాంగ్రెస్ రెండు పార్టీలు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశాయని ఇటు పార్టీలు అటు ప్రజలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో ఏర్పాటు అవ్వబోయే మూడో ఫ్రంట్ కి గాను వెంకయ్య నాయుడుని ప్రధాని అభ్యర్ధిగా నిలబెడతారని.. ముఖ్యంగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలతో ఆయనకు ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకుని మద్దతు కూడగట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్ళవచ్చని వ్యూహం సిద్దం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ నేపధ్యంలో వెంకయ్య ను ప్రధాని అభ్యర్ధి గా ప్రతిపాదిస్తే సగం బిజెపి మంది ఎంపిలు ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వటానికి రెడి గా ఉన్నారని శత్రుజ్ఞ సిన్హా వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక నేషనల్ వెబ్సైట్ లో వచ్చిన ఈ వార్త ఇప్పుడే సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతుంది. మోడీ మీద పెరుగుతున్న వ్యతిరేకత కు ఇదే నిదర్శనం అని చెప్తూ నెటిజన్లు కామెంట్స్ విసురుతున్నారు. శత్రుజ్ఞ సిన్హా ముందు నుంచి మోడీ వ్యతిరేక వర్గం లో ఉన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here