జగన్ మాతో కలిసే అవకాశం లేదు,మేము ఒంటరిగానే పోటి – విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు విజయవాడ లో బుజేపి కోర్ కమిటి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే, ఈ భేటి లో రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న నేతలు హరి బాబు, విష్ణు కుమార్ రాజు,సోము వీర్రాజు, పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ కోర్‌ కమిటీ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందన్న ఆరోపణల్లో వాస్తవంలేదని, ఏపీకి కేంద్రం ఏం చేయలేదనడం తప్పుడు ఆరోపణలు అని తేల్చారు. అంతే కాకుండా వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లోకి సెంటిమెంట్‌ని తీసుకెళ్లి బురదచల్లే ప్రయత్నం చేయడం చాలా తప్పు అని అభిప్రాయ పడ్డారు. పార్టి కి ఉన్న వనరులు, వ్యవస్థను బట్టి ప్రజల్లోకి వెళ్ళాలని, రాష్ట్రానికి ఏమేమి ఇచ్చామో చెప్పాలని తీర్మానించారు.

బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత విష్ణు కుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బీజేపీలో ఎందుకు కలుస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు జగన్ తమతో కలిసే అవకాశం లేదని, తనతో మీట్ అయితే బీజేపీలో కలిసిపోయినట్టేనా? అని వ్యాఖ్యానించారు. బీజేపీతో వైసీపీ జత కట్టబోతోందంటూ వస్తున్న వార్తలపై జగన్నే అడిగి తెలుసుకోవాలన్నారు. అవసరం అయితే తాము ఒంటరి గా అయినా పోటి చేస్తాం అని తేల్చి చెపారు. టీడీపీ, బీజేపీ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో కొందరు బీజేపీ‌పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. అవి అవాస్తవాలని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొచ్చారు. ఓట్ల రూపంలో ప్రజల్ని వాళ్లవైపు మార్చుకునేందుకు కుటిలయత్నాలు చేస్తున్నారు. దాన్ని మేము ప్రజలముందుకు తీసుకెళ్తాం. మంగళగిరి ఎయిమ్స్‌కి ఏమీ చేయలేదని టీడీపీ వాళ్లు అంటున్నారు. అక్కడ పని మొదలయ్యింది. ఉన్నవి లేనట్టు. లేనివి ఉన్నట్టు చెప్పడంలో వాళ్లకి వాళ్లే సాటి. నిజాయితీగా ప్రజలకోసం పనిచేయడమే మాకు తెలుసు అని తీవ్రం గా విమర్శించారు. అయితే నిజం గా బిజెపి అంత బాగా రాష్ట్రానికి చేస్తే విడిపోయే అవసరం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరొక పక్క తమ పార్టి వోట్ బాంక్ గణనీయం గా పెరిగింది అని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here