వరుణ్ తేజ్ తొలి ప్రేమ రివ్యూ

Advertisements

ఫిదా హిట్టు తో కావాల్సిన ఊపు వచ్చిన వరుణ్ తేజ్ వెంకి అట్లూరి ని దర్శకుడు గా పరిచయం చేస్తూ చేసిన సినిమా తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ క్లాసిక్ ఫిలిం తోలిప్రేమ టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా కి సంగీతం ఎస్ ఎస్ తమన్.ఎక్కువ భాగం ఫారెన్ లో షూటింగ్ లో జరుపుకున్న ఎ చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖాన్న వరుణ్ తో జతకట్టింది.ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూ లో చూద్దాం…

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

వరుణ్, రాశి ఖన్నా మధ్యలో కెమిస్ట్రీ బావుంది

Lighter Vein Entertainment పెద్ద ప్లస్ ఈ సినిమాకి

కొత్త దర్శకుడి సన్నివేశాలు కుడా కొత్త గా ఉన్నాయి

ఫ్రెష్ గా ఉండటం, విజువల్ గా బావుండటం యాడ్ అయ్యాయి

తమన్ ఇచ్చిన వాటిల్లో నాలుగు సాంగ్స్ బావున్నాయి

డైలాగ్స్ లో మంచి డెప్త్ ఉంది, లవ్ స్టోరి లో ఆ డెప్త్ దొరకటం కష్టం

కాని సెకండ్ హాఫ్ మొత్తం ఎదో మిస్ అయిన ఫీల్ ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎమోషన్ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యింది అనిపిస్తుంది

తోలి దర్శకుడు అయిన వెంకి అట్లూరి ట్రీట్మెంట్ బావుంది

బివిఎస్ఎన్ ప్రసాద్ గారి నిర్మాణ విలువలు బావున్నాయి

రాశి ఖన్న కి ఊహలు గుస గుస లాడే తర్వాత దొరికిన ఒక మంచి రోల్

ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో ఇంకాస్త డెప్త్ ఉండుంటే మరొక మంచి లవ్ స్టోరి గా నిలిచిపోయేది. కాని ఈ తొలిప్రేమ మంచి సినిమా. అర్బన్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసిన మూవీ వారికి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 3/5

Advertisements

Leave a Reply