రాజ్యసభకి ఎంపిక కాకపోవటంపై తొలిసారి స్పందించిన వర్ల : వైకాపా మీడియాకి క్లాసిక్ కౌంటర్

వర్ల రామయ్య ఎంపిక అయిపోయినట్టే అని రాత్రి నుంచి వార్తలు వచ్చాయి. ఆయనకు పార్టి వాణిని బలంగా వినిపిస్తారు అనే పేరు ఉంది. ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎంపిలు లోక్ సభ కి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణం లో, మాదిగ సామాజిక వర్గం నుంచి రెండవ అభ్యర్ధిని ఎంపిక చెయ్యాలని భావించినట్టు గా తెలుస్తుంది. ఎంపిక లాంచనమే, మరి కాసేపట్లో ప్రకటన వస్తుంది అని అందరూ ఆశించిన తరుణంలో అనూహ్యం గా కనకమేడల రవీంద్ర కుమార్ పేరు తెర మీదకి రావటం, టికెట్ కన్ఫర్మ్ కావటం చక చక జరిగిపోయాయి.ఈ నేపద్యం లో వార్ల తీవ్ర నిరాశకు లోనయ్యారు అని, ఆయన పార్టి ని వీడి వైకాపా లో చేరతారు అని వైకాపా అనుకూల మీడియా వార్తలు వండి వడ్డించింది.

 

అయితే రాజ్యసభ అభ్యర్ధిగా తొలుత ఖరారు చేసినా చివరి క్షణంలో పార్టీ తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. తాను పసవి ఆశించిన మాట వాస్తవమే అని, అనూహ్యం గా మిస్ కావటం  కొంత బాధ కలిగించినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు శిరోధార్యమన్నారు. అలాగే కొందరు నేతలు వ్యవహరించినట్టు నేను పదవుల కోసం పార్టీ మారే రకం కాదు అన్నారు. చంద్రబాబు కోసమే, చంద్రబాబుకు అండగా ఉండటమే తనకి తెలిసిన రాజకీయం అని, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని రామయ్య పేర్కొన్నారు. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, ఎదురు దెబ్బలు కామనే, అంత మాత్రాన అందరు ఉన్న పార్టి వదిలి వేరే పార్టి పెట్టటమో, వేరే పార్టి లోకి వెళ్ళటమో సొల్యూషన కాదు. కొన్ని పార్టీలు, వారి అనుకూల మీడియాలు అలాంటి పద్దతిలో పుట్టినా, వార్ల రామయ్య గారు అలా కాదు అనేది ఆయన తెలిసిన వారి మాట. మొత్తానికి చంద్రబాబు తోనే నేను అని గట్టు కౌంటర్ ని వైకాపా అనుకూల మీడియా కి పంపారు. చంద్రబాబు వర్ల సేవలను మరొక కీలక పదవిలో వాడుకుంటారు అని సమాచారం.  అయితే పార్టీ నిర్ణయం శిరోదార్యం అన్న వర్ల మాటలను తెదేపా నాయకులు కార్యకర్తలు అభినందిస్తున్నారు. పార్టి లో లేని పోనీ వివాదాలు పుట్టించాలని చుస్తున్న వారికి ఇది చెంప పెట్టు అని వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here