BREAKING : రాజ్యసభ రేసు నుంచి వర్ల రామయ్య ఔట్ అనూహ్యంగా తెర మీదకొచ్చిన మరొక పేరు..ఖరారు?

రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఉన్న రెండు పదవుల కోసం ఆసవహుల లిస్టు బారెండంత ఉంది. మూడవ స్థానం కి పోటీ పెట్టె అవసరం లేదని చంద్రబాబు భావించినట్టు గా తెలుస్తుంది. అయితే నిన్న ఉదయం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. రాజ్యసభ టికెట్‌ను దక్కించుకోవడం కోసం కొందరు నేతలు భారీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.రాయలసీమ నుంచి ఓసీ అభ్యర్థికి, కోస్తా నుంచి ఎస్సీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందులో భాగం గానే సిఎం రమేష్, వర్ల రామయ్య పేర్లు దాదాపు గా ఖరారు అయినట్టే అని మీడియా లో వార్తలు సైతం వచ్చాయి, మారి కాసేపట్లో ప్రకటన అనగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వార్ల రామయ్య ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లే తెలుస్తుంది…. వివరాల్లోకి వెళ్తే

వర్ల రామయ్య కి మరొక కీలక పదవి ప్రామిస్ చేసి, ఆయన పేరు ని రేసు నుంచి తప్పించినట్టు గా సమాచారం. ఆంధ్ర జ్యోతి MD వేమురి రాధ కృష్ణ సూచన మేరకు సి ఎం రమేష్ కు రాజ్యసభ సభ్యత్వం పొడిగించిన చంద్ర బాబు, వర్ల రామయ్య పేరు ని సైతం ఖాయం చేసినట్టు సమాచారం వచ్చింది. అయితే అనూహ్యం గా సీనియర్ న్యాయవాది,పార్టీ లీగల్‌ సెల్‌  అధ్యక్షుడు‌ కనకమేడల రవీంద్ర కుమార్ పేరు తెర మీదకు రావటం, టికెట్ ఖరారు అవ్వటం చాలా నాటకీయం గా జరిగాయి. చంద్రబాబు శ్రేయోభిలాషి అయిన ఒక న్యాయమూర్తి సూచన మేరకు కనకమేడల అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్టు గా తెలుస్తుంది. గుంటూరు జిల్లా కు చెందిన రవీంద్ర కుమార్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. తెలుగు దేశం కార్యకలాపాల్లో చురుకు గా పాల్గొనే ఈయన న్యాయవాది కూడా. ఈ నేపధ్యం లో వర్ల రామయ్య కు మరొక కీలక పదవి ప్రామిస్ చేసి, రవీంద్ర కుమార్కు ఎంపి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు గా వార్తలు వస్తున్నాయి. రవీంద్ర కుమార్ పార్టి కి విధేయుడు గా పని చేసారని, తక్కువ మాటలు ఎక్కువ పని గా ఆయన వ్యవహారం ఉండేది అని చెప్తున్నారు. అనూహ్యం గా తెర మీదకి వచ్చి ఎంపి గా కన్ఫర్మ్ అయినందుకు తెలుగు దేశం నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఈ నేపధ్యం లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలియ చేసారు.అయితే సిఎం రమేష్, రవీంద్ర కుమార్ అభ్యర్దిత్వాల మీద ప్రకటన వెలువడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here