జూన్ రెండో వారంలో భారీ బహిరంగసభతో తెదేపా లోకి వంగవీటి రాధ MP గా పోటి

Advertisements

వంగవీటి రాధా పార్టి మారటం ఖాయం అని ఎప్పటి నుంచొ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన పార్టి మారట్లేదని, మారే అవకాశమే లేదని కొందరు వైకాపా నేతలు వ్యాఖ్యానించారు. కాని రాధా నోరు విప్పకపోవటం పార్టి మార్పు వార్తలకి బలం చేకూరుస్తుంది. వైఎస్ జగన్ తనకి నమ్మక ద్రోహం చేసాడని, పొమ్మనలేక పొగ పెడుతున్నాడని రాధా భావించటమే ముఖ్య కారణం గా కనిపిస్తుంది. సెంట్రల్ టికెట్ ఆశిస్తున్న రాధాకు మల్లాది విష్ణుని సెంట్రల్, వెల్లంపల్లి కి పశ్చిమ, యలమంచిలి రవి కి తూర్పు టికెట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించటంతో రాధా అవమానానికి గురయ్యారు. అంతే కాక


2019లో కుడా వైకాపా అధికారం లోకి రాదనీ, మోసపోతూ ఓడిపోయే పార్టిలో ఉండే అవసరం ఏంటి అని అనుచరులు వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా వంగవీటి రంగ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడిన గౌతమ్ రెడ్డి మీద సస్పెన్షన్ ఎత్తివేయటం కూడా రాదా తాజా నిర్ణయానికి కారణం గా తెలుస్తుంది. అంతే కాకుండా జగన్ ముద్రగడ ను కాపు నాయకుడు గా గుర్తించి ఆయన చెప్పిన ఐదుగురు కి టికెట్స్ ఇస్తా అని హామీ ఇవ్వటం తో తన రాజకీయ భవిష్యత్ కోసం పార్టి మారాలని డిసైడ్ అయ్యారట.జూన్ రెండో వారంలో విజయవాడలో భారీ బహిరంగ సభపెట్టి ఆ సభలోనే తన బలం చుపించుకూవాలని రాదా అనుచరులు కోరుతున్నారట. అయితే స్పష్టమైన హామీ వస్తే కాని ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని రాధా భావించినట్టుగా తెలుస్తుంది.అయితే కాపు రిజర్వేషన్స్, కాపు కార్పోరేషన్స్ తో కాపులకు మరింత చేరువైన తెదేపానే బెటర్ అని అనుచరులు చెప్తున్నారట. ఐతే తండ్రి ని చంపిన చోటకి ఎలా వెళ్తాం అని ప్రశ్నించగా, గతంలో రాధా తల్లి రత్నకుమారి తెదేపా నుంచి పోటి చేసిన విషయాన్ని,అంతే కాకుండా దశాబ్దం పాటు దేవినేని కుటుంబంతో కాంగ్రెస్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారట.ఐతే రాధా టిడిపిలో చేరినా విజయవాడ నుంచి రాధా ఆశిస్తున్న సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా, తూర్పు నుంచి

గద్దె రామ్మోహన్,పశ్చిమ నుంచి జలీల్ ఖాన్ లాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో,రాధాను ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్సిగా పంపితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసారట. ఐతే రాధా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేసి తన బల నిరూపణ కోసం ఆసక్తిగా ఉండటం తో, కాపు సామాజికవర్గం ప్రభావితం అయ్యే విధంగా ఎంపి గా పంపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తెలుగుదేశం నాయకులు చేసినట్టుగా తెలిసింది. అందుకే కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే అవనిగడ్డ,మచిలీపట్టణం,పెడన లాంటి నియోజకవర్గాలు ఉన్న మచిలీపట్టణం నుంచి ఎంపి గా పోటి చేయిస్తే విజయం ఖాయం అని తెదేపా అధినాయకత్వం భావిస్తుందట. అంతే కాక గన్నవరం నుంచి వల్లభనేని వంశి, గుడివాడ నుంచి కొడాలి నాని రాధాకి వ్యక్తిగతంగా మంచి స్నేహితులు కావటం కూడా కలిసి వస్తుంది అనుకుంటున్నారు.మిగిలిన రెండు నియోజకవర్గాలలో పామర్రు, పెనమలూరు లో కూడా తెదేపా కి పట్టు ఉండటం తో మచిలీపట్టణం ఎంపిగా ఐతే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి వచ్చి మంచి మెజారిటి తో గెలవొచ్చు అని రాధా బృందం లెక్కలు వేస్తుందట. అంతే కాకుండా గత రెండు సార్లు ఎంపి మచిలీపట్నం నుంచి ఎంపి గా గెలిచిన కొనకళ్ళ నారాయణ రావుకి ప్రస్తుతం ఆరోగ్యం అంత బాగోకపోవటం, వచ్చే ఎన్నికల్లో పోటి చేసే అవకాశం లేకపోవటం కూడా రాధాకు కలిసి వచ్చే అంశం.

Advertisements

Leave a Reply