BREAKING : ఆంధ్రా రైల్వే జోన్ పై సమాచారం ఇచ్చిన కేంద్రం

మార్చ్ 5 కల్లా ఆంద్ర ప్రదేశ్ కి రాల్వేయ్ జోన్ ఇస్తాం అని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో వైజాగ్(వాల్తైర్) రైల్వే జోన్ ఉంది. వైజాగ్ రైల్వే డివిజన్ లో ఉన్న ఓడిసా కు చెందిన ప్రాంతాలను ఓడిసా కి వదిలేసి, ఈ రైల్వే జోన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, కొత్తగా ప్రకటించే రైల్వే డివిజన్ లో ఓడిసా ప్రాంతాలను తీసేసాక మిగిలిన వైజాగ్ డివిజన్ తో పాటు, గుంటూరు రైల్వే డివిజన్, విజయవాడ రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్ తో కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు గా లీకులు వచ్చినట్టు తెల్సిందే.

ఆంధ్రా కు రైల్వేజోన్ వస్తుందని,ఉద్త్గాలు అభివృద్ధి పెరుగుతాయని , గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రజలు వేయికళ్లతో వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నేతలు సైతం జోన్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. బిజెపి ఎంపి, రాష్ట్ర అధ్యక్షుడు అయితే వచ్చుద్ది అని చేతునే ఉన్నారు. కాని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ని నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకున్న కేంద్రం, ఒక్క హామీ ని కూడా తీర్చకుండా, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ విషయమ అందరికి తెలిసిందే. అయితే తాజాగా విశాఖ రైల్వ్యే జోన్ మీద ప్రకటన చేసింది. సోమవారం సాయంత్రం రైల్వే జోన్‌‌పై కేంద్రం తేల్చేసింది. ఏపీకి రైల్వే జోన్‌ లేనట్టేనని కేంద్రం చెప్పేసింది. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం రైల్వేజోన్‌ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ దినేష్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం 13వ షెడ్యూల్‌పై ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చ జరుగుతోంది. కేంద్రం లో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎం చెయ్యరు అని డిసైడ్ అయ్యాక , కేంద్రం నుంచి బయటకి వస్తే ఇంకేం చేస్తారు అని భావిస్తున్నారు. జగన్ మహాన్ రెడ్డి తన స్వార్ధం కోసం త్మంత్రులు రాజీనామా చేసే వరకు పోరాడారు అని, ఇప్పుడు రైల్వ్ జోన్ దేనికి రాలేదే ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇంత నిష్కర్ష గా వ్యవహరించటం కేంద్ర మంత్రులే హర్షించటం లేదు అన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here