జగన్ కి ఝలక్ : TDPలోకి ఇద్దరు సీనియర్ నేతలు, జిల్లాలోని రెడ్డి సామాజికవర్గంలో బలం పుంజుకున్న తెదేపా

రాష్టంలొ రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.ఎన్నికల వేళ నేతలంతా సురక్షిత స్థానాల కోసం చూసుకుంటున్నారు. ఏపార్టీలో తాము శ్రేయస్కరమన్న విషయంలో అంచనాలు వేసుకుంటున్నారు. అందులో భాగంగా గడిచిన ఎన్నికల్లో దూరంగా ఉన్న ప్రకాశం జిల్లా సీనియర్ నాయకులు ఈసారి బరిలో దిగడం కోసం ఆసక్తిగా ఉన్నారు. అయితే అందుకు తగ్గ పార్టీ విషయంలో సందిగ్దం రాజ్యమేలుతోంది. కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి మెరుగైన అవకాశాలున్నాయి. గడిచిన ఎన్నికల్లో కూడా ఆపార్టీ విజయం సాధించింది. కానీ పోతుల రామారావు పార్టీ ఫిరాయించడంతో తగిన నాయకుడి కోసం ఎదురుచూడాల్సిన స్థితిలో మాజీ మంత్రి మానుగుంట మహిందర్ రెడ్డి కోసం విపక్ష నేతలు ప్రయత్నించారు. అయితే ఆయన మాత్రం చివరి వరకూ వాయుదా వేసుకుంటూ వచ్చారు. అంతే కాకుండా మానుగుంట సైకిల్ ఎక్కడానికి సిగ్నల్స్ ఇస్తున్నారు.తాజాగా చంద్రబాబు ఓకే చెప్పడంతో ఇక సైకిల్ సవారీ షురూ కాక తప్పదనే ప్రచారం ఊపందుకుంది. అయితే కందుకూరులో పోతుల రామారావు

సిట్టింగ్ ఎమ్మెల్యేగా, దివి శివరాం మాజీ ఎమ్మెల్యేగా టికెట్ రేసులో ఉన్నారు. అయితే దివి శివరాం కి ఇప్పటికే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటంతో మానుగుంట, పోతుల మధ్యలోనే పోటి ఉండేలా ఉంది. అలాంటి పరిస్థితిని అధికార పార్టీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. అయితే మానుగంటని ఎమ్మెల్సీ చేయడానికి మాత్రమే చంద్రబాబు అంగీకరించారని టీడీపీలోని పోతుల వర్గం ప్రచారం చేస్తుండడం విశేషం. అంతే కాకుండా మానుగుంటకు తోడుగా ముక్కు ఉగ్రనరసింహరెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆయన కూడా ఎప్పటి నుంచో టీడీపీ వైపు చూస్తున్నారు. సామాజిక సమీకరణాల రీత్యా ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నేతలు టీడీపీ లో చేరడం అత్యవసరం అని భావిస్తున్న చంద్రబాబు ఉగ్రతో కూడా టచ్ లో ఉండాలని టీడీపీ నేతలను ఆదేశించారు. దాంతో కనిగిరి పరిణామాలు కూడా ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య అనుచరుడు కదిరి బాబూరావు కనిగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని కాదని ముక్కు ఉగ్ర నరసింహరెడ్డిని ముందుకు తెస్తే ఎలాంటి పరిణామాలుంటాయన్నది చూడాలి. ఏమయినా ఇద్దరు మాజీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే వైసీపీకి ఆ రెండు స్థానాల్లో భారీ నష్టం తప్పదనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. జగన్ఒ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు తెదేపా లో చేరటం తో ఒక రకం గా ఇది చంద్రబాబు వైకాపాని కొట్టిన చావు దెబ్బ అనే చెప్పుకోవచ్చు. జిల్లా స్థాయిలో బలం అయిన వర్గం కలిగి ఉన్న ఈ నేతల చేరికతో జిల్లాలోని రెడ్డి సామాజికవర్గంలో తెదేపా బలం పుంజుకుంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here