CLASSIC : చంద్రబాబు ఇచ్చిన ఈ రెండు రివర్స్ పంచ్ లు ఈ Year లోనే టాప్

అసెంబ్లీ లో ఇప్పటి వరకు ఎప్పుడు లేని కామెడి అవుతుంది. నలభై మంది రౌడీ గాళ్ళనే అల్లాడించిన తెలుగు దేశానికి, ఇప్పుడు నలుగురుకి సమాధానం చెప్పే పని పడింది. ఆ నలుగురు బాగా డిస్కస్ చేసి, ముగ్గుఋ డిసైడ్ అయ్యి, ఇద్దరు లేక్కలేసుకుని, ఒక్కరు మాట్లాడటం చూస్తున్నాం.ఆ ఒక్కరు కూడా ఎం చెప్తారు, మేమిచ్చాం, మేము తెచ్చాం, చాలా ఎక్కువ ఇచ్చాం, చాలా ఎక్కువ తెచ్చాం…. బాగు బాగు…అంతా బానే ఉంది…కాకపోతే వీళ్ళని సీరియస్ గా ఎలా తీసుకుంటాం…మొదటి సారి అసెంబ్లీ కి వచ్చిన్రు..  చాలా లైట్ తీస్కోవాలి అన్నట్టు… కాని తప్పదు రా భాయ్….

ఈ నేపధ్యం లో ఒక బిజెపి ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము రోడ్లకు భారీగా నిదులిచ్చాం,మా వల్లే డబల్ డిజిట్ గ్రోత్ వచ్చిందన్నారు. చంద్ర బాబు ఆ రెండిటికి సమాధానం చెప్పారు.  వాళ్ళు జస్ట్ గిల్లితే చంద్రబాబు ఎడా పెడా వాయించారు. రోడ్లకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని బీజేపీ చెబుతోందని, అది వాళ్ల డబ్బేమీ కాదని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పేశారు. ప్రజా ధనాన్ని వాళ్లు ఇచ్చినట్టు చెప్పుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్‌లో రోడ్లు వచ్చాయని, రేపటి రోజున రోడ్లు వేసిన వాళ్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. ట్రాఫిక్‌ను బట్టి రోడ్లు వస్తాయని, అవి కూడా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతోనే రహదారులు నిర్మించారన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కావని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గడ్కరీకి ఆ రోజే తాను చెప్పానన్నారు. రోడ్లు ఇవ్వకపోతే తానే నిర్మించుకుంటానని చెప్పిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.అంతే కాకుండా డబుల్ డిజిట్ గ్రోత్ మా వల్ల వచ్చిందని బిజెపి చెప్పుకుంటుంది అని,  ఒక వేళ అదే నిజం అయితే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆ గ్రోత్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ దెబ్బ కి కిక్కురుమనకుండా కూర్చున్నారు ఆరోపణలు చేసిన వారు.  రాష్ట్ర బీజేపీ నేతలు చేసినా చేయకపోయినా.. తాను మాత్రం పని చేసుకుంటూ వెళతానన్నారు. జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం

మంచిది కాదని.. జాతి ప్రయోజనాల దృష్ట్యావెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దారిలోనే బీజేపీ వెళుతోందని.. అది సరైంది కాదని సీఎం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా చంద్రబాబు దూకుడు పెంచటం ఆంధ్రులు హర్షిస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here