సొంత మనుషుల వల్ల ఘోర అవమానం : డిప్రెషన్ లో త్రివిక్రమ్?

Advertisements

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక గొప్ప దర్శకుడు, అంతకు మించి ఒక గొప్ప రచయిత,అన్నిటికీ మించి ఒక మంచి మనిషి. కాని ఒక్క సినిమా కి ఇవన్ని మర్చిపోయారు. త్రివిక్రమ్ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు కొందరికి. కాని రచయిత గా ఆయన కెపాసిటి మీద సందేహాలు దేనికి? వాసు,స్వయంవరం, చిరునవ్వుతో,మన్మధుడు,నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఒకటా రెండా ఎన్ని సినిమాల్లో ఎన్ని సార్లు సింపుల్ డైలాగ్స్ తో నవ్వించారు? మర్చిపోగలమా? దర్శకుడు గా  నువ్వే నువ్వే,అతడు, జల్సా,జులాయ్,సన్నాఫ్ సత్యమూర్తి, ఖలేజా,అత్తారింటికి దారేది…ఇలాంటి చిత్రాలు ఇచ్చారు. అలాంటి త్రివిక్రమ్ ని ఒక సినిమా, ఒక రిలీజ్ ఎవరికీ కాని వాడిగా చేస్తుందా? టాలెంట్ లేని వాడిగా లేక్కేస్తుందా? ఒక్క ఫ్లాప్ అంటే ఒక సక్సెస్ అవ్వని ప్రయత్నం, ప్రపంచ వినాశనం కాదే? ఈ సినిమా ఫ్లాప్ అవ్వటం వల్ల పవన్ కళ్యాణ్ కి సినిమాలు ఆగిపోతాయా? త్రివిక్రమ్ చేసిన వర్క్ మర్చిపోతామా? నిజమే కాపి కొట్టి తీసారు, మనలో ఎంత మంది నీతి నిజాయితీ కొలమానంగా పెట్టుకుని కనీసం పక్క వాడి పాపర్ లో చూడకుండా ఎక్జాం రాసాం, ఎంత మంది పక్క వాడి ఐడియా మనది గా చెప్పుకున్నాం, ప్రతి సినిమా ఇంకో సినిమా కి కాపీ నే….ఉద్దేశం త్రివిక్రమ్ తప్పు చెయ్యలేదని కాదు, ఆయన మనిషే, తప్పులు చేస్తాడు అని గుర్తు చెయ్యటమే. అంతే.. అలాంటి ఒక వ్యక్తిని అవమానిస్తే ఫ్లాప్ సినిమా హిట్ అయిపోతుందా?

నిన్నటి నుంచి ఇంటర్నెట్ లో ఎన్నెన్ని ట్రోల్స్,ఎన్నెన్ని మేమ్స్, ఎంత కోపం? ఎంత పగ? ఎంత కసి? ఎంత ఆవేశం.. ఇదంతా వారం రోజులు లైఫ్ ఉండే ఒక సినిమా కోసమా? పవన్ కళ్యాణ్ ఇంత కంటే పెద్ద ఫ్లాపులు చూసాడు, త్రివిక్రమ్ తీసిన వాటిల్లో ఖలేజా ఒక్కటే భారి గా నష్టం వచ్చింది, ఐతే మాత్రం ? హిట్ ఐతే పవన్ వల్ల? ఫ్లాప్ ఐతే దర్శకుడి వల్లనా? అదేమీ లాజిక్? అత్తారింటికి దారేది కి ఆయన కి శాలువా కప్పి సన్మానం చేసారా? అజ్ఞాతవాసి కి రాళ్ళు వెయ్యటానికి? 2003 జాని నుంచి గుడుంబా శంకర్,బాలు,బంగారం,అన్నవరం తో వరుస ఫ్లాప్స్ లో ఉంటె జల్సా ఇచ్చింది ఎవరు? త్రివిక్రమ్ కాదా?  అసలు పవన్ త్రివిక్రమ్ థర్డ్ కాంబినేషన్ అనే క్రేజ్ వల్లనే 1.5మిలియన్ కేవలమ్ ప్రీమియర్స్ నుంచి వసూలు చేసింది అనే విషయం అంత కన్వీనియెంట్ గా ఎలా మర్చిపోయారు? త్రివిక్రమ్ గాడ్ కాస్తా త్రివిక్రమ్ గాడు అయ్యారా? అదేం న్యాయం?  నిజమే అజ్ఞాతవాసి సినిమాలో కామెడి బాలేదు, సీన్స్ బాలేదు,ఎమోషన్స్ బాలేదు, అజ్ఞాతవాసి నిస్సందేహం గా ఒక చెత్త సినిమా. త్రివిక్రమ్ అన్ని రకాలు గా ఫెయిల్ అయ్యారు, ఐతే తిట్టేస్తామా….ఆయన డైలాగ్స్ తో ట్రోల్స్ చేసుకున్న వాళ్ళు ఇవ్వాళ ఆయన మీద ట్రోల్స్ చేసే అంత ఎదిగారా?

ఆయన RTC X రోడ్స్ లో సినిమా చూడటానికి వస్తే ఫాన్స్ చేసిన కామెంట్స్ కి హార్ట్ అయ్యి సినిమా మధ్యలో నుంచి Depressed గా వెళ్ళిపోయారు అని చదివాను, అది నిజమా అబద్దమా తెలీదు. నిజం కాకుండా ఉంటె బావుండు అనిపిస్తుంది,ఒక వేళ అబద్దాన్ని నిజం గా నమ్మించటానికి ఎవరన్నా ప్రయత్నిస్తుంటే వారికి నా ప్రగాడ సానుభూతి. నిన్న ఉదయం వరకు పవన్ ఫాన్స్ కి ఆయన కూడా కుటుంబ సభ్యుడే,సొంత వాడే. స్వయంగా పవనే చెప్పారు నాకు ఎవరి లేని రోజున నాతొ ఉంది త్రివిక్రమ్ అని. త్రివిక్రమ్ గొప్పోడు,దేవుడు అని చెప్పటం ఈ ఆర్టికిల్  ఉద్దేశం కానే కాదు. త్రివిక్రమ్ కుడా మనిషే, తప్పులు చేస్తారు అని చెప్పటం మాత్రమె. చివరగా ఒక చిన్న మాట అజ్ఞాతవాసి చూసి తల గోడకి కొట్టుకున్న వారిలో నేను ఒకడిని, కాని ఆయన మీద రాళ్ళు వెయ్యటానికి ఆలోచించే వాడిని కూడా. ఆయన వ్యక్తిగత జీవితం మీద కత్తి మహేష్ కి కాని, సుత్తి సురేష్ కి కాని, చపాతి రమేష్ కి కాని వంద అభిప్రాయలు ఉండొచ్చు, నాకు కూడా ఉండొచ్చు, కాని సినిమాల్లో ఆయన ఏమిటి అనేది నాకు ముఖ్యం. ఆయన ఇంకొక పది అజ్ఞాతవాసి తీయొచ్చు కాక,ఆయన తీసిన గత 8 సినిమాలు, రాసిన కొన్ని పదుల సినిమాలు, నవ్విన కొన్ని వందల సందర్భాలు ఆయన మీద రాయి వెయ్యనివ్వటం లేదు. Salute Trivikram !! Wishing Good Luck for NTR’s Film….

Advertisements

Leave a Reply