టచ్ చేసి చూడు బుల్లెట్ రివ్యూ

Advertisements

దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తన స్థాయి కి తగిన హిట్టు రాజా ద గ్రేట్ కొట్టిన మాస్ మహా రాజ రవితేజ, మరొక్కసారి కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ చేసిన చిత్రం టచ్ చేసి చూడు. 2010లో వచ్చిన మిరపకాయ తర్వాత వీర,నిప్పు,దరువు,దేవుడు చేసిన మనుషులు, సారోచ్చారు, బలుపు, పవర్, కిక్2, బెంగాల్ టైగర్ వరకు ఫ్లాపుల దండయాత్ర చేసిన రవితేజ, రాజా ద గ్రేట్ తో ఆగినట్టే కనపడ్డాడు. టీజర్ తోనే అంచనాలు ఆకాశాన్ని దాటించిన ఈ టచ్ చేసి చూడు ఎలా ఉందొ, అసలు టచ్ చెయ్యొచ్చో లేదో మా బుల్లెట్ రివ్యూ లో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

సినిమా చాలా ఇంటరెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది

కొన్ని సన్నివేశాల్లో రవితేజ వయసు తెలిసిపోతుంది

రాశిఖన్నకి మరొక ఆర్డినరి రోల్,సీరత్ కపూర్ కూడా ఉంది.

తొలి సగంలో కథ ఏమి లేదు,చాలా స్లోగా సాగుతుంది

సహనం పరీక్షించిన ఫస్ట్హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఒక మోస్తరు గా ఉంది

టీజర్ లో చూసిన సీన్స్ సెకండ్ హాఫ్ లోవి,అవి పర్లేదు

సంగీతం అసలు బాలేదు,బాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే

సినిమా లో క్వాలిటి కనిపించదు,అసలు ఖర్చేమన్నా పెట్టారా అనిపిస్తుంది

తోలి చిత్రం దర్శకుడు విక్రం సిరికొండ అన్ని రకాలు గా ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి.

ఓవరాల్ గా ఎదో ఊహించిన వారికి వేరేదో కనపడుతుంది.స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడా కూడా ఇక్కడ బావుంది కదా అనిపించదు.రవితేజ హిట్టు కొట్టాడు అని సంతోషించేలోపే ఫ్లాప్ మళ్ళి వచ్చేసింది.

రేటింగ్ : 2/5

Advertisements

Leave a Reply