కుర్ర హీరోయిన్లు – క్రేజీ రెమ్యునరేషన్లు – Top 10 వీరే

Advertisements

సమంతా, కాజల్,రకుల్,అనుష్క,తమన్నా ప్రస్తుతం తప్పుకుంటున్న తరుణం లో కొత్త తరం హీరోయిన్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. వాస్తవానికి తెలుగు లో హీరోయిన్స్ కెరీర్ స్పాన్ తక్కువ ఉంటుంది,వరుసగా హిట్లు పడితే ఐదారేళ్ళు, ఒక వేళ ఫ్లాప్స్ వస్తే సంవత్సరం లోపలే ఫేడ్ అయిపోయే వాళ్ళున్నారు.అయితే ఇప్పుఉద్ తెలుగు లో కొత్త రక్తం ఉరకలేస్తుంది….దర్శకులు కూడా కొత్త హీరోయిన్స్ కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రేమమ్ హిట్ తో మలయాళీ బ్యూటీలు అనుపమ పరమేశ్వరన్, సాయు పల్లవిలకు మన వాళ్ళు ఫిదా అయిపోయారు. అలానే ఇప్పుడు తెలుగు లో ఉన్న టాప్ 10 హీరోయిన్స్ లిస్టు ఇలా ఉంది.

పూజా హెగ్డే ముకుంద తో ఎంట్రి ఇచ్చి, ఒక లైలా కోసం తో వరుసగా రెండు సినిమాలు ఆశించిన విజయం అందివ్వకపోవటం తో నిరాశ చెందినా దువ్వాడ జగన్నాథం తో క్రేజీ హీరోయిన్ అయ్యింది. ముఖ్యం గా అందులో గుడి లో బడిలో సాంగ్ లో అమ్మడిని చుసిన కుర్రకారు వెర్రెక్కి పోయారు. ఇప్పుడు ఆ అమ్మడు అభిషేక్ నామా నిర్మాత గా శ్రీవాస్ దర్సకత్వం లో వస్తున్నా చిత్రం సాక్ష్యం లో బెల్లం కొండ శ్రీనివాస్ సరసన నటించటానికి అందుకున్న అమౌంట్ అక్షరాలా కోటి నలభై లక్షలు. ఎప్పుడు ఎదో ఒక వివాదం లో ఉండే సాయి పల్లవి తో పని చేసిన హీరోస్ కి నిర్మాతలకు  ఎదో వివాదం ఉంటుంది. అలాంటి సాయి పల్లవి కి ప్రేక్షకులలో క్రేజ్ విపరీతం గా ఉంది. ఈ కుట్టి కి సినిమా కి దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు ఇవ్వటానికి సైతం నిర్మాతలు రెడి గా ఉన్నారట. ఇక పొతే మూడో స్థానం లో నేను శైలజ,నేను లోకల్ ఫెమ్ కీర్తి సురేష్ ఉంది. గ్లామర్ కి స్థానం లేకుండా కేవలం నటన తో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ దృష్ట్యా 90లక్షల నుంచి కోటి రూపాయిలు ఇవ్వటానికి సైతం నిర్మాతలు రెడి గా ఉన్నారట. కీర్తి మూడో స్థానంలో ఉంది.

ఇక నాలుగో స్థానంలో భరత్ అనే నేను తో డెబ్యు చెయ్యబోతున్న కైరా అద్వాని ఉంది. మహేష్ చిత్రం రిలీజ్ కి ముందే రాం చరణ్ పక్కన హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసిన ఈ అమ్మడు రాం చరణ్ సరసన నటించటానికి దాదాపు 80 లక్షలు డిమాండ్ చేసినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో గుస గుస. కుర్ర కారు గుండె చప్పుడు నివేదా థామస్ జై లవకుశ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది, ఆ అమ్మడు నటిస్తాను అంటే 75 నుంచి 80 లక్షలు ఇవ్వటానికి నిర్మాతలు రెడి అట. మరొక ప్రేమం బ్యూటి అనుపమ పరమేశ్వరన్, శతమానంభవతి,ఉన్నది ఒకటే జిందగీ తో మంచి డిమాండ్ లోకి వెళ్ళింది. కాలేజ్ కుర్రవాళ్ళ కలల రాకుమారి గా మారింది.ఈ మలయాళీ కుట్టి కి షుమారు 60 నుంచి 70 ఇవ్వటానికి రెడి గా ఉన్నారు.అంతే కాక నాని సరసర మజ్ను లో డెబ్యు చేసిన అను ఇమాన్యువెల్ కి సైతం షుమారు 40 నుంచి యాభై లక్షలు ఇవ్వటానికి రెడి గా ఉన్నారట. అను ఏడవ స్థానం లో ఉంది. వీళ్ళు అందరు టాప్ స్టార్స్ సరసన కనీసం ఒక్క సినిమా అయినా చేసి ఉన్నారు. వీరు కాక ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కనీసం ఒక్క బ్రేక్ కూడా దొరకని మరొక ముగ్గురు, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో కలిసి చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.

అందాల రాక్షసి తో డెబ్యు చేసిన లావణ్య త్రిపాఠీ,ఎస్ఎంఎస్ తో వచ్చిన రెజినా కసాండ్రా,ఊహలు గుస గుసలాడే తో లాంచ్ అయిన రాశి ఖన్నా చాలా కాలం నుంచి ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం యావరేజ్ కూడా దక్కలేదు. కాని రాశి కి తోలి ప్రేమ తో సక్సెస్ దొరికింది. తోలి ప్రేమ కి రాసి షుమారు నలభై ఐదు లక్షలు అందుకుంది. లావణ్యా త్రిపాఠి, రెజినా కు సినిమాకు 30 నుంచి 35 లక్షలు ఇస్తున్నారు. వీరివురు తొమ్మిదవ స్థానం లో ఉన్నారు. ఇక పది లో అర్జున్ రెడ్డి ఫేమ్ తోలి సినిమా కు ఐదు లక్షలు అందుకుంది, కాని క్రెడిట్ అంతా విజయ దేవరకొండ కొట్టుకెళ్ళటం వల్లనో ఏమో కాని,ఈ అమ్మడు అనుకున్న క్రేజ్ రాలేదు.తమిళ్ లో రెండు చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగు లో మాత్రం పాతిక లక్షలు చార్జ్ చేస్తాను అంటుంది. తదుపరి నిఖిల్ చిత్రానికి షుమారు పాతిక లక్షలు అందుకుంటుంది అని సమాచారం. ముందుగా అనుకున్నట్టు హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే పనిలో ఉంటారు. క్రేజ్ ఉన్నప్పుడే మూడు కాలేజ్ ఫెస్ట్ లు, ఆరు షాప్ ఓపెనింగ్స్ చేసుకుంటూ డబ్బులు చేసుకుంటారు. వారిని తప్పు పట్టటం కూడా ధర్మం కాదు అనుకోండి అది వేరే విషయం.

అయితే ఈ హీరోయిన్స్ కి సంబందించిన రేమ్యునరేషన్స్ కాక, వీరి ట్రావెల్ ఖర్చులు, వారో టీమ్ ఖర్చులు, బిజినెస్ క్లాస్ టికెట్స్, బౌన్సర్లు, షూటింగ్ జరిగినన్ని రోజులు డైట్ ఖర్చులు అన్ని ప్రొడ్యూసర్ ఖాతాలో పడతాయి, అవి అదనం. ఇది మన టాలివుడ్ టాప్ 10 పరిస్థితి.

Advertisements

Leave a Reply