SOCIAL VIRAL : చంద్రబాబు మీద పెట్టిన ఈ పోస్ట్,సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది

చంద్రబాబు వ్యూహాన్ని వ్యతిరేకించేవారు ఉన్నా, మెజారిటి వర్గాల్లో చంద్రబాబు కి మద్దతు పెరుగుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు మీద నమ్మకం పోతుంది అన్నారు. దానికి స్పందించిన ఒక సోషల్ మీడియా యూజర్ ఒక పోస్ట్ పెట్టాడు. మిత్రపక్షం గా ఉన్న జన సేన నుంచి చంద్రబాబు మీద విమర్శ వచ్చినా సహించలేకపోతున్నారు. ఆ యూజర్ చంద్రబాబు కి మద్దతు గా పెట్టిన ఈ పోస్ట్ సోషల్ వైరల్ ఆఫ్ ద డే.ఆ పోస్ట్ యదాతదం గా మీ కోసం….

పవన్ కళ్యాణ్ అభిమానులు కొంచం ఆలోచన చేయండి.(పవన్ గారు ఆవేశం లో మాట్లాడారు అనుకుంట ) PawanKalyan గారు చంద్రబాబు గారి మీద నమ్మకం పోతుంది అన్నారు,మాక్కూడా నమ్మకం పోతుందండి ఎవరి మీదో తెలుసా …

దేశం మొత్తం నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంటే కృష్ణా గోదావరి నదులని అనుసంధానం చేస్తూ Pattiseema కట్టి కృష్ణా రైతుల్ని కాపాడినందుకు నమ్మకం పోతుంది…..

పోలవరం కోసం ప్రతి సోమవారం రివ్యూ లు చెయ్యటం వలన నమ్మకం పోతుంది…. దేశం లో ఏ రాష్ట్రం వాడని విదంగా టెక్నాలజీ వాడుతున్నoదుకు నమ్మకం పోతుంది….

RTG Center(Real Time Governance) అని టెక్నాలజీ ని గవర్నింగ్ లో వాడుకోవడం వలన నమ్మకం పోతుంది….ఒక్కసారి వెళ్లి ఆ సెంటర్ ని చూసి రండి …వెళ్లాల్సిన అవసరం కూడా లేదు youtube లో చూడండి కళ్ళార్పకుండా చూస్తారు….

పదేళ్లుగా నీళ్ళు లేని చెరువులకు నీళ్ళు ఇచ్చినందుకు నమ్మకం పోతుంది…..

2004 తర్వాత 2014 ముందు ఎన్ని సంవత్సరాలు ఎండా కాలంలో కరెంటు లేక, towns లో దాదాపు 10 గంటలు,పల్లెల్లో అయితే ఎప్పుడు వస్తాదా అని ఎదురుచూసే వాళ్లు.అలాంటి పరిస్థితి నుంచి power లోకి వచ్చిన ఆరు నెలలు లోపే ఇళ్ళకి 24/7 (వేసవి లో కుడా) కరెంటు ఇస్తునందుకు నమ్మకం పోతుంది….

చిత్తూర్ శ్రీ సిటీ లో xiaomi, hero, isuzu, karbon ఇలా చాలా company లు పెట్టిoచినందుకు నమ్మకం పోతుంది.

అనంతపురం లో దేశం లొనే అతి పెద్ద FDI -Kia Motors Worldwideతో manufacturing plant పెట్టించి అనంతపురం అంటే కరువు ప్రాంతం కాదు automobile hub గా మారుస్తున్నoదుకు నమ్మకం పోతుంది….

10 years Hyderabad common capital అయినా 2 సంవత్సరాలలోనే అమరావతి నుంచి పరిపాలిస్తున్నoదుకు నమ్మకం పోతుంది…

AP ని ప్రపంచానికి SUN RISE STATE గా పరిచయం చేస్తున్నoదుకు మనకి నమ్మకం పోతుంది.

DAVOS లో జరిగిన WORLD ECONOMIC FORUM లో మహారాష్ట్ర CM, AP తో పోటి పడలేకపోతున్నాo అన్నందుకు మనకి నమ్మకం పోతుంది….

Made in AMARAVATI ఉత్పత్తుల మీద మన రాష్ట్రం పేరు చూసినప్పుడల్లా మనకి నమ్మకం పోతుంది….

ప్రపంచంలోని చాలా దేశాలలోని సంస్థలు బాబు గారి విజన్ని నమ్మి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ వస్తుoటే మనకి నమ్మకం పోతుంది….

Special status రానoదుకు ఆయన మీద నమ్మకం పోతే మరి ఇన్ని చేసినందుకు ఎం రావాలి పవన్ కళ్యాణ్ గారు……

మీరు కూడా ఆలోచించకుండా మాట్లాడటం ఏమి బాలేదు. రోజుకి 18 గంటల పైన కష్టపడుతున్న వ్యక్తీ మీద నమ్మకం పోతుంటే ఇంకెవరిని నమ్మాలి.

29 సార్లు ఫైల్స్ పట్టుకుని ఢిల్లీ వెళ్లి ఇవీ మాకు ఇంకా రావల్సినవి అని ఎంతో మందిని కలిసి చెప్పినా కూడా central government ఇవ్వాల్సినంత ఇవ్వడం లేదు, అయినా ఆయన డెవలప్ చేస్తూనే ఉంటారు sir. బాబు గారికి మోడి గారు ఒక సంవత్సరం పాటు appointment ఇవ్వలేదు.ఇదే టైమ్ లో కొన్ని cases lo A2 గా ఉన్న వ్యక్తికి Appointment ఇచ్చారు.దీని గురించి చెప్పండి

ఒకటి మాత్రం నిజం చంద్రబాబు గారు మన రాష్ట్రానికి CM గా ఆయన అనుభవం మన రాష్ట్రానికి చాలా అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here