బాలయ్యకి ఎదురే లేదు

Advertisements

నందమూరి బాలకృష్ణ పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి తారక రామారావు గారి నట వారసుడుగానే కాకుండా రాజకీయ వారసుడిగా కూడా తనదైన ముద్ర వేసారు. సంక్రాంతి కి బాలయ్య కి ఉన్న సంబంధం గురించి కొత్తగా చెప్పే పనేమీ లేదు. సంక్రాంతి సింహం గా బాలయ్య అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మినరసింహ,గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్స్ ని సంక్రాంతి సీజన్ లోనే కొట్టాడు బాలయ్య. ఐతే మరొక్క సారి జై సింహ తో బాలయ్య ఈ సంక్రాంతి బరిలో నిలిచాడు.

ఐతే ఈ సంక్రాతి బరిలో నాలుగు చిత్రాలు ఉండటంతో తీవ్ర ఉత్కంటత నెలకొని ఉంది.పైగా ఈ సారి బరిలో పవన్ కళ్యాణ్,సూర్య బరిలో ఉండటంతో మరింత మజా వచ్చింది. కాని  తొలుత వచ్చిన అజ్ఞాతవాసి పవన్ కెరీర్లోనే అతి పెద్ద ఫ్లాప్స్ లో ఒకటి గా నిలిచింది. తర్వాత ఒకే రోజు వచ్చిన జై సింహా, గ్యాంగ్ లలో జై సింహ తోలి షో నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. గ్యాంగ్ బోల్తా పడింది, నాలుగువ చిత్రం గా వచ్చిన రంగుల రాట్నం స్లో నేరేషన్ వల్ల ఆకట్టుకోలేకపోయింది. జై సింహ తోలి రోజు మంఛి వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్ లో నాలుగవ హయ్యెస్ట్ ఓపెనర్ గా రికార్డ్ సాధించింది. రెండవ రోజు,మూడవ రోజు కూడా వసూళ్ళు నిలకడగా ఉండటంతో, కుటుంబ ప్రేక్షకులు, మాస్ ప్రేక్షకులు ఆదరించటం తో సంక్రాంతి విన్నర్ గా  నిలబడింది. గత సంక్రాంతి కి శాతకర్ణితో అలరించిన బాలయ్య,ఈ సంక్రాంతి కి జై సింహ తో మరొక హిట్ తన ఖాతా లో వేస్కోటంతో పాటు, సంక్రాంతి కి బాలయ్యకి ఎదురు లేదు అనే అభిమానుల సెంటిమెంట్ నిజం చేసారు. ఈ సినిమాలో అమ్మ కుట్టి సాంగ్ లో బాలయ్య ఎనర్జీ కోసం ఎన్ని సార్లైనా చూడొచ్చు అని అభిమానులు మురిసిపోవటం కొసమెరుపు.

Advertisements

Leave a Reply