రాజ్యసభ ఎన్నికల ముసుగులో జగన్ ని చంద్రబాబు కొట్టిన చావుదెబ్బ గమనించారా?

అసెంబ్లీ లో సంఖ్యాబలం ప్రకారం వైకాపా కి ఒకటి తెదేపా కు రెండు రాజ్యసభ స్థానాలు వస్తాయి. అయితే మూడవ స్థానం కోసమా పోటి పెట్టటమే అని నిర్ణయం తీసుకున్నాటు చంద్రబాబు. ఇందులో జగన్ కి కొట్టిన చావు దెబ్బ ఏంటి అంటారా? చదవండి అయితే… రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. తెలుగుదేశం చరిత్రలోనే తోలి సారి గా రెండు కి రెండు ఓసి అభ్యర్దులకి ఇచ్చారు. సిఎం రమేష్, కనకమేడల రవీంద్ర బాబు పేర్లు దాదాపు ఖరారు చేసారని చెప్పారు. అయితే ఇక్కడ జగన్ కి  చావు దెబ్బ ఏంటి అంటే, తొలినుంచి మూడు స్థానాలకు అభ్యర్ధులని పెడతారు అని వార్తలు వచ్చాయి. దీనితో జగన్ ఉలిక్కి పడ్డాడు…

వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గత 2014 ఎన్నికల ముందు వైకాపా లో జాయిన్ అయ్యి కొన్ని వందల కోట్లు ఎన్నికల ఖర్చు భరించారు అని వార్తలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిఉంటే అప్పట్లోనే వీపీఆర్‌కు రాజ్యసభ స్థానం దక్కేది. పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ అవకాశం పార్టీ కీలకనేత A2 విజయ సాయి రెడ్డి కి దక్కింది. దీంతో జగన్‌పై కినుక వహించిన వీపీఆర్‌ వైసీపీకి దూరమయ్యారు. ఈ సమయంలోనే మానసికంగా టీడీపీకి దగ్గరయ్యారు.రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరుతానని కండిషన్‌ పెట్టారు. అవసరం అయితే మూడో స్థానానికి పోటీ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని, మొత్తం ఎన్నికల నిర్వహణ భారం తానే మోస్తానని వివరించారు. అయితే దీనికి పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. ముందు పార్టీలో చేరండి, పనిచేయండి ఆ తరువాత ఆలోచిద్దాం అనడంతో వీపీఆర్‌ వెనక్కు తగ్గారు. తాజాగా మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే దశలో తెలుగు దేశం పావులు కదిపింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వలస వెళ్లిన క్రమంలో మూడో స్థానానికి టీడీపీ పోటీ పెడుతుందని పెద్దఎత్తున ప్రచారం జరిగేలా చూసారు.దీనికి తోడు చలమలసెట్టి సునీల్ లాంటి వారు తెదేపా లో చేరటానికి సిద్దం అని వార్తలు కూడా వచ్చాయి.దీనితో మూడవ స్థానం కి తెదేపా పోటి పెడుతుంది అన్న సమాచారం పక్కా గా ఉందని వైకాపా

ఆ పోటీని తట్టుకొని నిలబడగలిగే శక్తి కలిగిన వీపీఆర్‌ను అందుకు ఎన్నుకొంది. వాస్తవానికి ఆ స్థానాన్ని వైకాపా కి ఎప్పటి నుంచి దూరం గా ఉన్న కాపు లేదా బిసి సామాజిక వర్గాలకు కేటాయించాలి అని భావించారు. అయితే పోటీ అనివార్యమైనా తాను సిద్ధమేనని వీపీఆర్‌ స్పష్టం చేయడంతో ఆ స్థానం కోసమే వైసీపీ ఆయనను బరిలోకి దించింది. ఆ తర్వాత వైకాపా కేవలం రెడ్డి సామాజిక వర్గం కోసం పెట్టిన పార్టి అని సహజం గానే పెద్ద ఎత్తున నడిచింది. జగన్ చుట్టూ ఉండే కోటరి, పార్టి లో రెండవ స్థానం లో ఉన్న విజయ సాయి రెడ్డి,ఉన్న ఇద్దరు ఎంపిలు కూడా రెడ్డి అనే పాయింట్ ప్రజల్లోకి బలం గా వెళ్ళింది. అంతే కాక ఇద్దరు ఎంపిలు నెల్లూరు వాసులే. పాపం వైకాపా హైరానా పది తమ ఎమ్మెల్యేలని నేపాల్ లో కాంప్ కి సైతం పంపింది. కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టింది. అక్కడితో ఆగిందా అసెంబ్లీ కి వెళ్తాం కాని రాజ్యసభ ఎన్నికల కోసమే అని ఒక సచ్చు లాజిక్ చెప్పి పదవుల కోసం ఏమైనా చేస్తుంది వైకాపా అని జనం లోకి మెసేజ్ పంపుకుంది వైకాపా. తీరా చుస్తే రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు మంచిది కాదని, రాష్ట్రమే ముఖ్యం అని రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. దీనితో ముగ్గురు ఎంపిక ఏకగ్రీవం అయినట్టే. ఏకగ్రీవం అయిన ఎన్నికకు వైకాపా కోట్ల రూపాయిల ఖర్చు, ఒకే జిల్లాకు ఒక సామాజిక వర్గానికే పదవి అని అభాండాలు, అసంతృప్తి లేవనెత్తి చివరకు సైలెంట్ గా రాష్ట్ర అభివృద్ధి

కంటే రాజకీయాలు ముఖ్యం కాదు అన్న పంచ్ లైన్ తో వైకాపా అనుభవలేమిని మరొక మారు ఎక్స్పోజ్ చేసారు చంద్రబాబు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు సంవత్సరం చిన్న పొరపాట్లు కూడా బూతద్దం లో కనపడుతాయి, అందుకే వాళ్ళ వేలు తో వాళ్ళ కన్నె పొడిపించారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here