తెలుగు హీరో పై దొంగతనం కేసు,అరెస్ట్

Advertisements

తెలుగు హీరో మీద వేధింపులు మరియు దొంగతనం కేసు నమోదు అయ్యాయి. ఈ నెల 25న అతని భార్య ఈ కేసు ఫైల్ చేసింది. పంచాక్షరి, తకిటతకిట లలో హీరోగా, బావా, దేనికైనా రెడీ.ఆహా నా పెళ్ళంట,కిట్టు ఉన్నాదు జాగ్రత్త తదితర చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన సామ్రాట్‌ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తనను వేధిస్తున్నాడంటూ సామ్రాట్‌రెడ్డి భార్య హర్షిత రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిన్న రాత్రి సామ్రాట్‌ను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు అతడిని పోలీసు స్టేషన్ కి తరలించారు. సామ్రాట్ రెడ్డి ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి కి తమ్ముడు. రెండేళ్ళ క్రితం సామ్రాట్ రెడ్డి వివాహం హర్షితా రెడ్డి తో జరిగింది. అయితే గతకొన్నాళ్లుగా సామ్రాట్‌రెడ్డి, అతని భార్య హర్షిత రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సామ్రాట్‌రెడ్డిపై భార్య హర్షిత రెడ్డి 498-A సెక్షన్ కింద కేసు నమోదు చేసింది. అయితే ఇటీవల కాలంలో భార్యాభర్తలు ఇద్దరినీ పెద్దలు కూర్చోపెట్టి ఒక్కటి చేసినట్లు సమాచారం. అయితే ఇంతలోనే మరలా గొడవలు పెరిగినట్టు గా సమాచారం.

నవంబర్ 2017లో సామ్రాట్ పైన హర్షిత వరకట్న వేధింపుల కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. కొన్నాళ్ళు కలిసి ఉన్నారని భావించిన పోలీసులకు తన ఇంట్లో దొంగతనం చేశాడంటూ సామ్రాట్‌రెడ్డిపై హర్షిత రెడ్డి కేసు నమోదు చేయటంతో విచారణ జరిపారు.తానూ తన సొంత ఊరు వెళ్ళినపుడు సామ్రాట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి సిసి కెమెరాలు ధ్వంసం చేసి, ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకుపోయినట్టు కేసు నమోదు చేసింది. అయితే కావాలనే హర్షిత రెడ్డి దొంగతనం కేసు నమోదు చేసినట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. సామ్రాట్‌రెడ్డితో దూరంగా ఉండేందుకే హర్షిత రెడ్డి ఇలాంటి తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు భావించిన పోలీసులు అతడిపై మరోసారి 498-A సెక్షన్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisements

Leave a Reply