FULL DETAILS : చంద్రబాబు ఆగ్రహం ఆ TDP ఎమ్మెల్యే కెరీర్ ఖతం మరొక అభ్యర్ధి ఎంపిక పూర్తి

ఆ జిల్లా రాజకీయ చైతన్యం బాగా ఉన్న జిల్లా. రాష్ట్ర రాజకీయాలని డిసైడ్ చేసే జిల్లాల్లో అది ఒకటి. ఇది ఆ జిల్లా ఎమ్మెల్యే కథ,ఆయనో ఉన్నతాధికారి. హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. అదృష్టం కలసి వచ్చింది. టిడిపి తరుపున టిక్కెట్‌ దొరికింది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. తరువాత…చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన క్యాబినెట్‌ పదవి లభించింది. ఇంకేముంది ఆయనకు హద్దేలేకుండా పోయింది. ఎమ్మెల్యే కావడమే జీవిత లక్ష్యమనుకున్న ఆయనకు మంత్రి పదవి కూడా లభించడంతో చెలరేగిపోయారు. స్వంత పార్టీ వారి కన్నా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుసుకోవడంలోనూ, వారికి పనులు చేసి పెట్టడంలోనూ ముందున్నారు. దీంతో స్వంత పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని పార్టీ నాయకులు,

కార్యకర్తలు ఆయన చెవిన వేసినా పెద్దగా పట్టించుకోలేదు. ముందు కొద్దిగా ఉన్న అసంతృప్తి తరువాత పెరిగిపోయి చివరకు మంత్రి పదవికి ఎసరు తెచ్చింది. స్వంత పార్టీ కార్యకర్తలు, నాయకుల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ నాయకుడి పదవిని పీకేశారు. అధికార పార్టి ఎమ్మెల్యేలు కుడా ఆయన మంత్రి గా ఉన్నపుడు ఆయనని పని అడగాలి అంటే హడల్. జిల్లా నేతలు ఐతే సరే సరి, అంటి ముంటనట్టు ఉండేవారు. చంద్రబాబు మొదట్లో ఎక్కువ ప్రయారిటి ఇవ్వటం వల్లనో ఏమో, పార్టి లో సీనియర్స్ అంటే కూడా లెక్కలేని తనంగా వ్యవహరించేవాడని టాక్. ఇదంతా ఒక సైడ్తె…రెండో సైడ్ ఇంకా నీచం, తెలుగు దేశం పార్టి పెట్టినప్పటి నుంచి కొమ్ము కాస్తున్న ఒక సామాజిక వర్గం అంటే మంత్రి గారికి చిన్న చూపట.ఆ సామాజిక వర్గం వారు ఏదన్నా పనుల కోసం మంత్రి గారి కార్యాలయానికి వెళ్తే గంటల తరబడి వెయిట్ చేయించి రేపు రమ్మని చెప్పేవారట. వీళ్ళకి చెయ్యకపోయినా ఏమి కాదు, వాళ్ళు ఈ పార్టి ని వదిలి ఎక్కడికి పోరులే అని వెళ్ళిన వాళ్లకి వినిపించేలా వ్యంగ్యం చేసే వారట. ఆయన నియోజకవర్గం లో ముఖ్య ద్వితీయ స్థాయి నాయకులు అందరూ కలిసి మంత్రి నారా లోకేష్ ని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. మంత్రి గా ఉండి నియోజకవర్గం అభివృద్ధి

పక్కన పెట్టి “తన వర్గాన్ని” పెంచి పోషించారు అని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం మీద విపరీతం అయిన ద్వేషాన్ని ఎక్జిబిట్ చేసేవారు అని టాక్ బలం గా ఉంది. ఇతని టార్చర్ పడలేక MPTC ఒకరు రాజీనామా కి సిద్దపడ్డారు. అంతే కాక స్థానిక MPతొ కూడా తీవ్ర విబేధాలు ఉన్నాయని టాక్.అంతే కాక ఈ మంత్రి ఆగడాలు భరించలేక ఒక ZP చెయిర్ పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన పెట్టిన టార్చర్ చెప్పి కళ్ళ నీళ్ళ పర్యంతం అయిన విషయం మర్చిపోయేది కాదు. అంతే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద హైదరాబాద్ లో అయిన పోలీస్ కేసు ఒక సంచలనం. తర్వాత ఆయన రెండో కుమారుడు గుంటూరు లో లేడిస్ హాస్టల్ లో చేసిన రచ్చ మామూలు కాదు. దీంతో..ఆయన పార్టీలో పట్టుకోల్పోయారు. అయితే పార్టీలో ఉంటూనే ప్రత్యర్థి పార్టీతో సంబంధాల కోసం ఎమ్మార్పీస్ నాయకులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఉన్న సంగతి సిఎం నోటీస్ కి వెళ్ళింది. కావాలని పార్టి ని ఇరకాటంలో పెట్టి, ప్రత్యర్థి పార్టీ అధినేతను ఆకర్షించాలని భావించారు. ఆలోచించి నిర్ణయం తీసుకునే చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని పక్కన పెట్టారు. అయితే ఈయన ప్రత్యర్థి పార్టీకి ఎంత మేలు చేసే కార్యక్రమాలు చేసినా, ఇతను ట్రాక్ రికార్డు తెలిసి ఈయన పార్టీలోకి TDP-MPS-want-to-contest-from-Assemkly

వద్దు అని వైకాపా జిల్లా నేతలు సైతం చెప్పుకొస్తున్నారు. పార్టీలోకి రమ్మంటే వస్తానని సంకేతాలు పంపించినా ఆ పార్టీ నాయకులు లైట్ తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారట. మొత్తం మీద బంగారు పళ్ళెం లో బిర్యానీ పెట్టి ఇస్తే దానిని కింద వేసుకుని మట్టిలో మెతుకులు ఎరుకుంటాం అంటే ఎవరేం చెయ్యగలరు? ఆ నేత రాజకీయ జీవితం ముగిసి పోయినట్లేనని, దానికి కారణం ఆ నియోజకవర్గం లో పని మొదలు పెట్టుకోమని చంద్రబాబు ఇంకొక మహిళ నేతకు అవకాశం ఇచ్చారని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here