తెలుగుదేశం కి భారీ షాక్…. పార్టి వీడుతున్న మరొక కీలక కుటుంబం?

Advertisements

ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రధాన రాజకీయ పక్షాలు ఎత్తులు పై ఎత్తులతో బిజీ బిజీగా ఉంటున్నారు.ప్రతిపక్షం వైకాపా బలంగా ఉన్న నెల్లూరు జిల్లా రాజకీయాలు క్రమంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తోంది.నెల్లూరు జిల్లాలో బలమైన సామాజికవర్గమైన రెడ్డి సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైకాపా కి సపోర్ట్ చేసింది. అయితే కొంత మంది ప్రజాప్రతినిధులు పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు రావాలని భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లా కీలక నేత, ప్రస్తుత ఎంపి మేకపాటి రాజ మోహన్‌ రెడ్డి టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం వైకాపాలో చేరుతుందని ప్రచారం జరుగుతోంది. వై.ఎస్‌కు సన్నిహితమైన ఆనం కుటుంబం గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నా తరువాత టిడిపిలో చేరింది. టిడిపిలో చేరే సమయంలో తమకు ఇచ్చిన హామీలు ఏమీ చంద్రబాబు నెరవేర్చలేదని ఎన్నాళ్లు ఎదురుచూసినా తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వారిలో వ్యక్తం అవుతోంది. దీనిపై గతంలో ఆనం వివేకానందరెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపిలోకి వచ్చి తప్పు చేశామని ఆయన వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. కాగా గత కొన్ని రోజుల నుంచి వివేకానందరెడ్డి ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆనం కుటుంబ సభ్యులందరూ కలసి కూర్చుని మాట్లాడుకుంటున్నారని రాజకీయంగా అందరం ఒకే పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తమకు ఏమీ చేయని టిడిపిలో ఉండడం కన్నా వైకాపాలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ కుటుంబం ఉందని తెలుస్తోంది. కాగా పార్టీ మారడంపై ఆనం రామనారాయణరెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టిడిపిలో తమకూ అవకాశం వస్తుందని అప్పటి వరకు వేచి చూడాలని ఆయన తన వర్గానికి చెబుతున్నారట. ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో మొన్న సింగపూర్‌ పర్యటనకు వెళుతూ

ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఆగి వివేకానందరెడ్డిని పరామర్శించి వెళ్లారు. దీంతో ఆనం కుటుంబ అసంతృప్తిపై చంద్రబాబు త్వరలో స్పందిస్తారని అప్పటి వరకు ఆగాలని రామనారాయణరెడ్డి అంటున్నారట. కాని ఆయన అనుచరులు మాత్రం పార్టి మారాలని ఒత్తిడి చేస్తున్నారట. మొత్తం మీద మేకపాటి కుటుంబం టిడిపిలోకి వస్తే ఆనం కుటుంబం వైకాపాలోకి వెళుతుందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చూద్దాం మరి ఏమి జరుగుతుందో !?

Advertisements

Leave a Reply