చీమలు పెట్టిన పుట్టల్లో పాములు…? రగిలిపోతున్న టిడిపి అభిమానులు

ఒక పార్టి కి బలం కార్యకర్తలు, ఆ తర్వాతే నాయకులు. తెలుగు దేశం లాంటి పార్టి కి అయితే నిఖార్సు అయిన కార్యకర్తలే నిజం అయిన బలం. ఇదే మాట ఆ నాడు ఎన్టీఅర్ చెప్పారు, ఇప్పుడు చంద్రబాబు చెప్తారు. పార్టి కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలే తెలుగు దేశం బలం బలగం. పార్టి ని వీడిన నాయకులు ఉన్నారేమో కాని, ఆ కార్యకర్తల భుజాల మీద నడుచుకుంటూ ఎదిగిన నాయకులు మాత్రం కార్యకర్తల కష్టాన్ని పెట్టుబడి గా పెట్టుకుని, వాళ్ళ పబ్బం గడుపుకుంటారు.అధినాయకుడు తో ఒక్క ఫోటో చాలు అనుకునే నిస్వార్ధమైన కార్యకర్తలు ఉన్న తెలుగు దేశం లో కొన్ని కలుపు మొక్కలు చేరుతున్నాయి. కార్యకర్తల కష్టాన్ని

తమ కష్టం గా చెప్పుకునే చీడ పురుగులు పెరిగాయి, వీళ్ళకి పక్క పార్టి వారితో హార్దిక సంబందాలు, ఆర్ధిక సంబందాలు ఉంటాయ్. ఇలాంటి వారు అలా నడుచుకుంటూ అధినేత ని కలుస్తున్నప్పుడు, వారితో పాటు పార్టి మీద పొద్దునే లేస్తే విషం చిమ్మే వారిని తీసుకుని వెళ్తున్నప్పుడు ఎవరికీ బాధ ఉండదు చెప్పండి? అలాంటి ఒక సంఘటన చెన్నై తెలుగు దేశం ఫోరం అభిమానులని తీవ్రం గా గాయపరిచింది.సోషల్ మీడియా లో అలా తమ అక్కసు ని నిస్సహాయం గా వ్యక్త చేస్తున్న ఒక కార్యకర్త మనోగతమే ఈ క్రింది పోస్ట్.

తెలుగుదేశం పార్టీ అంటే అమితమైన అభిమానం ఉన్నవారు…. దేశం మొత్తం ఉన్నారు. పొరుగు రాష్ట్రం రాజధాని చెన్నైలో వీరు లక్షల సంఖ్యలో ఉంటారు. ప్రత్యేకంగా అక్కడ టిడిపి తరుపున కొంతమంది సంఘటితం గా… సొంత ఖర్చు లతో…. పార్టీ ఫోరం ను నడిపిస్తున్నారు. ఎన్నికల ముందు మాత్రమే కాదు…. ఎప్పుడు తెలుగు దేశం పార్టీ కి సంఘీభావం తెలపాల్సిన అవసరం వచ్చినా… వేల మందిని సిద్దం చేసి అధినాయకుడు కి, పార్టీ కి మనో ధైర్యం అందించేందుకు… కష్ట నష్టాలు చూసుకో లేదు… చెన్నై టిడిపి ఫోరం నేతలు, కార్యకర్తలు. ఒక్కో రేణువు పెంచుకుంటూ చెన్నై టిడిపి ఫోరం కి ఒక అస్తిత్వం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు… నికార్సయిన టిడిపి అభిమానులు పెట్టుకున్న ఆ పుట్టలో… పాములు చేరుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు తో…సీఎంకే రెడ్డి

అనే వ్యక్తి ఫోటో దిగాడు. ఇందులో విశేషం ఏమీ లేదు. కానీ సదరు సిఎం కే రెడ్డి ని తాను చెన్నై టిడిపి ఫోరం కి కన్వీనర్ గా చెప్పుకునే వ్యక్తి టిడిపి అధినేత వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. కొన్ని ఫోటో లు చూపించి… పార్టీ అధినేత వద్ద మార్కులు కొట్టే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత పనుల కోసం…. అధికార పార్టీ నేత పేరుతో దందాలు చేసేందుకు దానిని సదరు సిఎం కే రెడ్డి…టిడిపి అధినేత తో దిగిన ఫొటోలు వాడుతున్నారు. ఇంతకీ ఈ సిఎం కే రెడ్డి ఎవరో కాదు…. బిట్ కాయిన్ పేరుతో రెండు వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన సైకం రామకృష్ణారెడ్డి బంధువు అంటారు కొంతమంది…బందువు అనే సంగతి పక్కన పెడితే మంచి మిత్రుడు అన్న సంగతి మాత్రం ఆయన ఫేస్ బుక్ ఫ్రోఫైల్ చూస్తే తెలుస్తుంది. తన గుండె కోస్తే జగన్ వస్తారని చెప్పుకునే… సైకం రామకృష్ణారెడ్డి…. వారి బంధువులు….. తమ అక్రమాలకు…. టిడిపి… ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే చెన్నై వైయస్ ఆర్ కాంగ్రెస్ చెన్నై ఫోరం పేరుతో సైకం రామకృష్ణారెడ్డి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు కొత్తగా వారే… టిడిపి అభిమానులమంటూ.. చంద్ర బాబు నాయుడు కు దగ్గర చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీరికి టిడిపి లోని కొంత మంది నేతలే సహకారం అందిస్తున్నారు. సైకం మోసం మొత్తం తెలిసినా కొంత మంది నాయకులు…. వీరిని టిడిపి కి దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నికార్సయిన టిడిపి అభిమానుల ను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా… టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు… శత్రువు నైనా….దగ్గర చేసుకుంటారు. పక్కన ఉన్న నేతలు చెప్పే సమాచారం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ పార్టీ అధినేత కే… రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి…. అసలైన కార్యకర్తల కు అన్యాయం చేస్తున్నారు. చెన్నై టిడిపి ఫోరం పేరుతో పార్టీ కార్యక్రమాలు చేపట్టే వారు కొందరైతే వారి కష్టాన్ని…. అధినేత వద్ద వేరే వారి పరం చేసేందుకు వెనుకా ముందు చూడటం లేదు. తమ కష్టాన్ని…. అధినేత దగ్గర చెప్పలేదు అని…. నిజమైన చెన్నై టిడిపి ఫోరం నాయకులు మనసు నొచ్చు కోవడం లేదు… కాని….. తమ పేరుతో దొంగలను టిడిపి లో కి తెచ్చే ప్రయత్నాలు వారిని ఆందోళన కు గురి చేస్తున్నాయి. తమకు గుర్తింపు కన్నా… పార్టీ క్షేమం ముఖ్యం అని వారు అంటున్నారు. సైకం రామకృష్ణారెడ్డి, వారి బంధువుల ను పార్టీ దరికి చేరనీయకుండా దూరం పెట్టాలని కోరుతున్నారు.

పార్టి కార్యకర్తల కష్టాన్ని తమ కష్టం గా చెప్పుకునే వారిని అధినేత చుట్టూ ఉండేవారన్నా గుర్తించాలి అని తెలుగుదేశం అభిమానులు కోరుతున్నారు. రేపు ఎవరన్నా ఏదన్న స్కామ్ చేసి దొరికితే చంద్రబాబు మనిషి గా ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here