EXCLUSIVE : డెడ్ లైన్ మార్చ్ 5 తర్వాత టిడిపి యాక్షన్ ప్లాన్ ఇదే? చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్

అంధ్రా కి తక్కువలో తక్కువ ముప్పావలా తక్కువ లక్షన్నర కోట్లు ఇచ్చాం అని, ఆంధ్రప్రదేశ్ కి ఎలా ఖర్చు పెట్టుకొవాలో తెలీట్లేదని అడ్డగోలు గా వాదిస్తున్న బిజెపి ని చూసి భారీ సంఖ్యలో ఉన్న వందా నూట యాభై మంది కార్యకర్తలు సైతం సిగ్గు పడుతున్నారు అనేది వాస్తవం. కాంగ్రెస్ ముందు నుంచి పొడిస్తే, బిజెపి గుజరాతి స్టైల్ లో నమ్మించి వెనుక నుంచి పొడిచింది అన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆ నాడు అడ్డగోలుగా రాష్ట్ర విభజన కి సహకరించి , ఈ రోజు కనీసం ఇవ్వాల్సినవి ఇవ్వకుండా కబుర్లు చెప్తున్న బిజెపి ని ప్రతి ఆంధ్రుడు ఈసడించుకుంటున్నాడు అనేది వాస్తవం. మిత్ర పక్షం అయిన తెలుగు దేశం కూడా బిజెపి ని వ్యతిరేకిస్తూ ఆందోళన  చేస్తుంది. మార్చ్ 5 వరకు డెడ్ లైన్ పెట్టింది. మార్చ్ 5 తర్వాత టిడిపి యాక్షన్ ప్లాన్ ఇదే అని సమాచారం….

ఇప్పటివరకు బిజెపి రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి అంకెలతో చెప్పే అవకాశం ఉంది. నేషనల్ మీడియా కూడా ఈ ప్రెస్ మీట్ కోసం ప్రత్యేకం గా వస్తున్నారు. నేషనల్ మీడియా తో పాటు లోకల్ మీడియా లో కొన్ని చానల్స్ కి ప్రత్యేకం గా ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాసం ఉంది.ఈ ఇంటర్వ్యూలో తెలుగు దేశం ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది. పార్లమెంట్ ఉభయ సభలలోను గడిచిన సెషన్ లో జరిగినట్టే నిరనసలు తెలియ చేస్తారు. నిరాహార దీక్ష చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది. అప్పటికి స్పందన రాకపోతే బడ్జెట్ సమావేశాలు ముగియటంతోనే ఇద్దరు మంత్రులు తమ రాష్ట్రం పట్ల “తమ మిత్రపక్ష” వైఖరి కి నిరసనగా రాజీనామా చేస్తారు. కాని ఈ నిరసన తెలిపే ఎప్పుడు కూడా NDA నుంచి బయటకి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. దీనితో పాటు రాష్ట్రం లో  ప్రజలు భాగ స్వాములు గా శాంతియుత ఆందోళనలు చెయ్యాలనే అంశం పరిశీలనలో ఉంది. ఇవన్ని కాక ఎన్నికలకి ఆరు నెలల ముందు తెలుగు దేశం ఎంపిలు అందరూ రాజీనామా చేసి NDA నుంచి బయటకి వచ్చేస్తారని తెలుస్తుంది. రాజీనామా చేసాకా ఎంపిలు అందరు ప్రజల్లోకి బస్సు యాత్ర ద్వారా వెళ్లి మోడీ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహాన్ని ఎండగడతారని తెలుస్తుంది. మోడీ ప్రభుత్వం మోసం చేసిందని, వాళ్లకి ఆ ధైర్యం రావటానికి కారణం పొత్తు కోసం, కేసుల మాఫీ కోసం వెంపర్లాడుతున్న వైకాపా అనేది ప్రజలు గ్రహించారు అని, కాబట్టి ఆ అంశాన్ని మరింత బలం గా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అనేది తెదేపా భావన గా తెలుస్తుంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here