ఇంత ఒత్తిడిలోనూ చంద్రబాబుని సంతోష పెట్టిన సర్వే రిపోర్ట్ ఇదే

ముందు నుంచి ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్తూ వస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి వారి పని తీరు మీద ర్యాంకింగులు ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఆరు నెలలకి ఒక సారి నియోజక వర్గ స్థాయిలో సర్వే చేయించి వాటి ఫలితం గా రాంకులు ఇస్తున్న చంద్రబాబు తాజాగా మరొక సారి రాంకులు ఇచ్చారు. గతం లో త‌న పార్టీ నేత‌ల‌కు, ఎమ్మెల్యేల‌కు సీల్డ్ క‌వ‌ర్‌‌లో ర్యాంకులు కేటాయించి క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. పార్టీ ప‌నిలోనూ, ప్ర‌భుత్వ విధానాల‌లోనూ వారి ప‌నితీరు ఆధారంగా నేత‌ల‌కు ర్యాంకులు కేటాయించే ప‌ద్ధ‌తికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు.

అయితే ఈ ర్యాంకులను వివిధ అంశాల మీద నేతల పని తీరు మీద ఆధారపడి ఇచ్చినట్టు గా తెలుస్తుంది. అయితే తాజా గా చేయించిన ఒక సర్వే చంద్రబాబు సంతోషించేలా చేసిందని తెలిసింది…బిజెపి చేసిన నమ్మక ద్రోహం దరిమిలా రాష్ట్రం లో తాజా పరిస్థితి మీద సమీక్ష చేస్తే రాష్ట్రం లో ముస్లింలు చంద్రబాబు మీద సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇచ్చిన రాజ శేఖర్ రెడ్డి వల్ల, బిజెపి టిడిపి మైత్రి వల్ల జగన్ తో చేరిన ముస్లింలు ఇమాంలకు ఐదు వేలు, మౌజన్లకు మూడు వేలు వేతనం గా చేల్లిస్తున్నా తెలుగుదేశం కి ఉపయోగం లేకపోయింది.అంతే కాక జగన్ ఈ మధ్య బిజెపి కోసం హిందువులకి దొరం అవ్వటానికి ప్రతి పీఠాదిపతి కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు చెయ్యటం ముస్లింలు ఒప్పుకోలేక పోతున్నారు. ఫరూక్ కి ఎమ్మెల్సి సీట్ ఇచ్చి మండలి చైర్మన్ ఇవ్వటంతోనే తెలుగు దేశం మీద నమ్మకం పెరిగిన ముస్లింలు, ఇప్పుడు జగన్ నీఛరాజకీయాలు చూడలేకపోతున్నాం అని చెప్పారు. అయితే ముస్లిమ్స్ కి కాబినెట్ లో పదవి లేదని అది అసంతృప్తి అని 52% మంది అభిప్రాయ పడగా, బిజెపి నుంచి బయటకు రావటం మంచి పరిణామం అని 91% మంది అభిప్రాయంగా తేలుస్తుంది.దీనితో మైనార్టీలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చెయ్యాలని, వారికి ఏమి కావాలో చూసి అవి అందించాలని సూచించారు చంద్రబాబు. చంద్రబాబు.అంతే కాకుండా త్వరలోనే కాబినెట్ లోకి ఒక మైనారిటి మంత్రి రావటం ఖాయం. అంతే కాకుండా ముస్లిం ఓటర్ల పై ప్రభావం చూపే ఇమాం,మౌజాన్లు, ఖాజీలకు తెలుగుదేశం మీద సానుకూలత ఉండటం తో చంద్రబాబు సంతోషించారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here