BREAKING : నిన్న కుటుంబ రావు గారి మీద నిప్పులు చెరిగిన విష్ణు వర్ధన్ రేంజ్ తెలుసా?

నిన్న ఒక ఛానల్ డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబ రావు గారి మీద నిప్పులు చెరిగిన సోమగుట్ట విష్ణు వర్ధన్ రెడ్డి ఎవరు అనే ప్రశ్న సగటు ఆంధ్రుడు ని తొలిచింది. ఏదన్నా ఒక వాదన లో విషయం ఉన్న వాడు గుంభనంగా ఉంటాడు, లేని వాడు గొంతు రైజ్ చేస్తాడు అనేది మనకి తెలిసిందే. ఆంధ్రా కి న్యాయం కావాలి అని రాష్ట్రం రగిలిపోతున్న దశలో నిన్న జరిగిన ఈ డిస్కషన్ లో ప్రతి ప్రశ్నకు అరుస్తూ సమాధానం, ఆవేశపడుతూ ఒగరుస్తు నిప్పులు చెరిగిన ఈ యువ నేత కొత్త గా బిజెపి లోకి వచ్చారా? రాజకీయ అనుభవం లేదా అని చిన్న ప్రశ్న వచ్చింది. గూగులమ్మ ని సందేహం అడిగితె యంగ్ లయన్ విష్ణు గారి ప్రొఫైల్ ఇచ్చింది.

విష్ణు గారు ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయన మీద ఒక నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరొక పక్క ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబ రావు గారు స్టాక్ అనలిస్ట్ గా చాలా మందికి తెలుసు, తెలుగు దేశం మానిఫెస్టో కమిటి లో సభ్యులు కూడా, ఎకనామిస్ట్, ఇంగ్లీష్ పాపర్ డేక్కన్ క్రానికల్ లో కాలమిస్ట్ కూడా. ఆయన చాలా శాంతమ్ గా నంబర్స్ చెప్తున్నారు. చాలా సార్లు రిక్వెస్ట్ చేసారు బాబు విష్ణు కొంచెం కామ్ గా ఉండు, చెప్పేది విను అని. మరొక పక్క మన యంగ్ లయన్ గారు మేము అదిచ్చాం,ఇదిచ్చాం అని అరుస్తున్నారు. డిస్కషన్ లో గెస్ట్ గా వచ్చిన లోక్ సత్తా జెపి గారు కూడా ఎవరు ఎవరికీ ఇచ్చేది ఏంటి, అది రాష్ట్రానికి ఉన్న హక్కు అని ఆయనదైన శైలిలో గ్రాసం వేసారు. అసలు ఆంద్ర ప్రదేశ్ కి అప్పులు ఉంటె అంత పెద్ద రాజధాని దేనికి అన్నప్పుడు బ్లడ్ బాయిల్ అయ్యింది, డిల్లి ని మించిన రాజధాని కడతాను అని తిరుపతి లో హామీ ఇచ్చింది ఏబి డివిల్లర్స్ కాదు, మన అప్పటి ప్రధాని అభ్యర్ధి, ఇప్పటి ప్రధాని మోడీ గారే. ఆ రోజు తెలీదా అప్పు ఉందని, ఆ రోజు తెలీదా పెద్ద రాజధాని అక్కర్లేదు అని? లాండ్ పూలింగ్ చేసేప్పుడు తెలీదా? ఇవి సగటు ఆంధ్రుడు కి వచ్చిన ప్రశ్నలు. ఈ విష్ణు అనే ఆయన ఇంత పెద్ద టాపిక్స్ మాట్లాడుతున్నారు, మినిమం గా రాష్ట్ర బిజెపి కి నేషనల్ ప్రెసిడెంట్ అయ్యి ఉంటారు అని మళ్ళి గూగులమ్మ ని అడిగా….ఈయన గారు మనకి కొత్త కాని, రాజకీయాలకి పాత. 2009 ఎన్నికలు గుర్తున్నాయా, అంటే సోము వీర్రాజు గారికి రాజమండ్రి లో ఇండిపెండెంట్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయే, ఆ ఎన్నికలే. బిజెపి సొంతం గా పోటి చేసిన అవే ఎన్నికల్లో మన విష్ణు భయ్యా కూడా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పోటి చేసారు.

ఆ ఎన్నికల్లో దాదాపు 1.01% ఓట్లు సాధించి తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్ధి వడ్డే కేసన్న చేతిలో 39 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి ఐదో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్ధి పల్లె రఘునాధరెడ్డి విజయం సాధించారు. రెండవ స్థానం లో కాంగ్రెస్ కి చెందిన కడపాల మోహన్ రెడ్డి, మూడు లో పిఆర్పి పసుపులేటి రమణ, నాలుగు లో ఇండిపెండెంట్ అభ్యర్ధి వడ్డే కేసన్న నిలిచారు. ఆ ఎన్నికల్లో షుమారు 1385 ఓట్లు సాధించి డోనాల్డ్ ట్రంప్ కి చెమటలు పట్టించారు. ఈయన నిన్న మాట్లాడుతున్న ధాటి కి హీటు కి సబ్జెక్ట్ మీద అచంచలం గా ఉన్న కమాండ్ కి ఆంధ్రుడు సలాం. అయ్యా విష్ణు వర్ధన్ గారు, మీకు తెలుగుదేశం తో ప్రాబ్లం ఉంటె వారితో వేరే డిస్కషన్ పెట్టుకోండి. అంధ్రా కి ఇంత రాజధాని దేనికి, అంత ఖర్చు దేనికి, అంత ఆడంబరం దేనికి లాంటి మాటలు వద్దు. మీరు అంత అడ్డగోలు గా వాదించినా ఆంధ్రప్రదేశ్ కి హక్కు గా రావాల్సినవి ఎక్కడికి పోవు, మేము కట్టే టాక్స్ మాకు ఇచ్చి అబ్బో ఇచ్చాం అని పిసుక్కోకండి. మీరేం దానం చెయ్యట్లేదు, మా హక్కు అది. 2009 అసలు జనాలకి ఏమి తెలీనప్పుడే మీకు 1500 ఓట్లు రాలేదు. ఇప్పుడు జనం ముదిరారు. మడత పెట్టేస్తారు. దయ చేసి ఎమోషన్స్ మీద రాజకీయాలు చెయ్యకండి. కాంగ్రెస్ కి పట్టిన గతి మీకు 2019లో పడుతుంది, మీకు ఈ మాత్రం ప్రజన్స్ కూడా ఉండదు రాష్ట్రం లో గుర్తెరిగి ప్రవర్తించండి.

ఈనగారి ప్రొఫైల్ తెలిసాకా నవ్వితే ఒప్పుకునేది లేదు…ఆంధ్రా ని తగ్గించి మాట్లాడితే ఎవరినైనా తగ్గించి మాట్లాడగలం.

– ఆంధ్రుడు.

1 COMMENT

  1. […] పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విష్ణు వర్ధన్ రెడ్డి అంటే ఆయనే. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here