SOCIAL VIRAL : ఇంటర్నెట్ ని ఊపేస్తున్నYSRCP అభిమాని పోస్ట్ ఇదే

Advertisements

వైకాపా అభిమానులు గత కొద్ది కాలం గా జగన్ చేస్తున్న పాద యాత్ర తో జోష్ లో ఉన్నా, జగన్ పాద యాత్ర విశేషాలు తమకి తప్పితే ఎవరికీ తెలీట్లేదని ఆవేదన ఉన్నా, ముఖ్యంగా వైకాపా శ్రేణులు తీవ్రం గా నిరాస పడుతున్న విషయం వైకాపా వ్యూహ రచన గురించి. పస లేని వైకాపా వ్యూహాల గురించి, వరుస పెట్టి వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ గురించి వాళ్ళ ఆవేదన తీవ్రం గా ఉంది. అయితే ఒక వైకాపా అభిమాని పెట్టిన పోస్ట్ విపరీతం గా షేర్స్ అవుతుంది…. షేర్ చేసే వారిలో ఎక్కువ మంది వైకాపా అభిమానులు కావటం వారిలో ఉన్న బాధ ని తెలుపుతుంది…. ఆ పోస్ట్ ఈ రోజు సోషల్ వైరల్ సెక్షన్ లో….మీ కోసం….యదాతదం గా…..

బాహుబలి లాంటి సినిమాలు తీసిన రాజమౌలి కాదు దేశంలో అత్యున్నత దర్శకుడు – చంద్రబాబు కాలి గోటికి కూడా ఆయన సరిపోడు.

ఎంత బాగా డైరెక్టు చేస్తున్నాడు ఢిల్లీలో తన పార్టీ ఎంపీలను, రాష్ట్రంలో నిత్యకల్యాణాల పచ్చ పావన కల్యాణుడిని – ఇంత జరుగుతున్నా నిద్రావస్థలోనే ఉన్న వైస్సార్సీపీని చూస్తుంటే వీల్లు మేలుకుంటరా అసలు అనిపిస్తుంది! ఉండవల్లి గారు వైస్సార్సీపీలోకి రేపొస్తాడు మాపొస్తాడని పార్టీ పెద్దలు చెప్తుంటే నిజమే కాబోలనుకున్నా! ఆయనతోనే కలిపి జేఈసీ పెడతాడంట పవనాలు – ఇది మొత్తం చంద్రబాబు డైరెక్షనే అని నమ్మనోల్లని ఏ దేవుడూ మార్చలేడు! ఒక్కొక్క అస్త్రం వైస్సార్సీపీ చేతిలోంచి జారిపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడానికి చంద్రబాబు నిర్మిస్తున్న చిత్రమే ఇది.

ఏ సేనా మమ్మల్ని ఎదిరించలేదని వైస్సార్సీపీ అధినేతనుండి హూంకరిస్తున్నారు! పరిస్థుతులు కొంచెం తేడాగా మారుతున్నాయని 2014లో పార్టీ పెద్దలతో అంటే భయపడొద్దు గురవా రెడ్డీ 135కి ఒక్క సీటు తగ్గినా నాకు ఫోన్ చెయ్యన్న పెద్దలు తర్వాత కాలంలో సిగ్గూ యెగ్గులేకుండా పాత పదవుల్లో కొనసాగడమన్నా లేక ఇంకా పెద్ద కొత్త పదువులన్నా తీసుకున్నారు! వ్యూహ రచన అనేది వీల్ల రక్తంలోనే లేదు. ఏదొ ఉన్నామంటే ఉన్నామనే టైప్. సొంత జిల్లాలో కూడా ఏమి జరుగుతున్నదో తెలియదు – ఆసక్తి కూడా లేదు!

తలలు పగిలేవి, మెడలు మెడలో తాళ్ళు తెగేవి ఊర్లలో ఉండి పార్టీ జెండా మోసి పార్టీకోసం పోరాడే వాల్లవే! వీళ్లకేమి కాదు సృజనా చౌదరిని, సీఎం రమేషులని తమ ఇంట్లో పెల్లికి పిల్చుకుంటారు పచ్చ మాఫియా ఇల్లల్లో జరిగే శుభకార్యాలకి వీళ్ళూ హాజరవుతారు కుటుంబ సమేతంగా!

చేతైతే చంద్రబాబు వ్యూహాలకి ధీటుగా వ్యూహరచన చెయ్యండి చేతకాకపోతే పదవులనుండి తప్పుకోండి అంతే గాని వైఎస్సారుని అభిమానించే గుండెలని కుల్లపొడవకండి మరొక్కసారి!

చూస్తూ…. ఉంటె కొన్నాళ్ళకి వైఎస్సర్సిపి కి ఫాన్ పార్టి గుర్తులోనే మిగిలేటట్టు ఉంది…

Advertisements

Leave a Reply