SOCIAL VIRAL: శివరాత్రికి శివయ్య ని ప్రార్ధిస్తూ ఒక చంద్రబాబు అభిమాని పెట్టిన పోస్ట్ తప్పక చూడాలి

బిజెపి, వైసిపి కలిసి విమర్శలు చేస్తున్న కొలది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి మద్దతు పెరుగుతుంది. చంద్రబాబు పడుతున్న కష్టాన్ని గుర్తించకుండా విమర్శలు చేస్తున్న వారి మీద సురేష్ అనే ఒక చంద్రబాబు అభిమాని వినూత్నమైన పోస్ట్ తో విరుచుకుపడ్డాడు. చంద్రబాబు ఎమన్నా ముని శాపగ్రస్తుడా? చంద్రబాబు మీద దేనికి ఇంత ఏడుపు అంటూ ఆటను ప్రశ్నించిన విధానం నెటిజన్లను విశేషం గా ఆకర్షిస్తుంది. మీరు కూడా చదవటానికి యదా తధం గా అందిస్తున్నాము…. చూడండి…

అయ్యా బోళా శంకరా శివయ్య మీ మూడో కన్ను తెరచి కళ్ళుండి చంద్రబాబు గారి కష్టాన్ని చూడలేని కబోది ల కళ్ళు తెరిపించు భగవంతుడా !

పళ్ళు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్లు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కు బానిస అయి పనిచేస్తున్న చంద్రబాబు మీద విమర్శలా

ఒక మనిషి మీద ఇంత మంది ఏడుపులా . . . దేవుడా నీవు అసలు ఉన్నావా ?

మరి లేకపోతే ఏంటిది దేవుడా . . . లేక ఆయనేమన్నా ముని శాపగ్రస్తుడా ?

అరవై పదులు దాటిన వయస్సులో ఆసాధ్యాలను సుసాధ్యాలుగా మలచి ఒక రాష్ట్రం కు రాజధాని ని కట్టుకుంటు , రాష్ట్ర లోటు బడ్జెట్ ను పూడ్చుకుంటు ఉన్న వనరులను ఉపయోగించుకుంటు దీటైన రాష్ట్రలకు పోటీ గా నిలబెట్టి ఆగ్రపధాన ఉంచటానికి 18గంటలు రోబో లా కష్టపడుతున్న ఆయన మీదకూడా రాళ్ళు విసురుతున్నారంటే మంచికి రోజులు లేవు దేవుడా?

కలికాలమంటే ఇదేనా భగవంతుడా ?
బహూశా ఇదేఅయ్యుంటుంది మంచిని గుర్తించకపోంగా ధైర్యంగా విమర్శిస్తున్నారంటే కలి లీలలే, తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అడ్డగోలుగా అక్రమార్జన చేసి లక్షల కోట్లు ఆస్ధిని గవర్నమెంట్ కు ఆటాచ్ చేయాలని సిబిఐ కోర్టు పిలుపిచ్చినోడిని కూడా ముఖ్యమంత్రిని చేయాలని కోంత మంది చెడు ను భుజాలపై మోస్తున్నారంటే కలికాలమే అనుకోవాలి భగవంతుడా ?

ఇలాంటి దోంగలను విమర్శించకుండా వీళ్ళను జాగ్రత్తగా కాపాడే ఉండవల్లి లాంటి వెదవలతో కలసి ప్రశ్నిస్తా అని తాడు బోంగరం లేని మాటలతో కుల రాజకీయాలు చేద్దామనుకునే వాళ్ళ రాజకీయాలకు కాలం చెల్లదా భగవంతుడా?

మంచికి సహకారం అందించలేని మూర్ఖులకు అభిమానులా ? ఎనిమిది గంటలు కష్టపడి పెళ్ళాం పక్కకై పరిగెట్టే ప్రతోడు దానికి డబల్ పనిగంటలు పనిచేసి చంద్రబాబు ని విమర్శించేవాడే ఏంది మాయ భగవంతుడా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాష్ట్రం విడిపోతే ఏలా అభివృద్ధి చేయాలో అవగహన పెంచుకోని ఒక పద్దతిగా లెక్క తో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి సామాన్యుడికివిభజిత రాష్ట్రం అనే లోటు కూడా తెలియనీయకుండా జనరంజకంగా పాలిస్తున్న ఆయనపై ఏడుపులా ఏంది శివయ్య?

కేంద్ర సహకారం లేదు , ఇంటిదోంగల ఏడుపు , ఆయన్ని అలా వదిలేస్తే ప్రజలుశాశ్వత ముఖ్యమంత్రిని చేస్తారని ఆడుగడుగున కాళ్ళల్లో కట్టే పెట్టే వెదవలు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని కరువు కాటకాలతో అల్లాడాలని , లా అండ్ ఆర్డర్ దెబ్బతిని రాష్ట్రం అల్లకల్లోలం కావాలని ఎదురు చూసే మనుషులకు కూడా అనుచరులా ? ఏంది ఈ దారుణం భగవంతుడా?

ఒక మనిషి మీద ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు , ఇన్ని మాయలా . . . . రాష్ట్రం ను కాపాడలని ఆయన ఒక వైపు ఉంటే కబలించటానికి వంది మాగాదులు ఒక వైపు . . . . . కురుక్షేత్రం సీన్ గుర్తుకు వస్తుంది

విజయం మంచికి దక్కేలా చూడు శివయ్య👏👏👏👏👏👏🏰🏰🏰 ప్రతి సంవత్సరం ఉపవాసాలతో నిష్టగా అభిషేకం చేసుకుంటాము అభిషేక ప్రియ👏👏👏👏. . . . . . . .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here