BREAKING : సోము వీర్రాజు సస్పెన్షన్ కి రంగం సిద్దం చేసిన రాష్ట్ర బిజెపి?

రాష్ట్ర బిజెపి లో రెండు వర్గాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తే హై కమాండ్ కరుణించలేదు. తెలుగు దేశం కోటా లో ఎమ్మెల్సి అయిన సోము వీర్రాజు తరచూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తు ఉంటారు.గతం లో ఎన్నో సార్లు నోరు జారిన సోము వీర్రాజు మరలా నోరు జారారు. అదీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై. ప్రధాని మోడీపై ఏపీకి చెందిన టీడీపీ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టే సమయంలో ఆయన నోరు జారారు.విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిపై సోము వీర్రాజు స్పందిస్తూ

బీసీ వర్గానికి చెందిన ప్రధాని, నీచ కులానికి, గాండ్ల కులానికి చెందిన మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని, ఆయనపై విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పా టు చేయడం బాధాకరమన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఒక కులాన్ని నీచ కులమని ఎలా సంభోదిస్తారని నిలదీశారు. వీర్రాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సూచించారు. మోడీది నీచకులమని కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యానించారని, దానినే తాను గుర్తుచేశానని వీర్రాజు చెప్పారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై ఇతర బీజేపీ నేతలు సైతం ఆయనపై మండిపడుతున్నారు. ఎప్పటి నుంచో సోము వీరాజు వ్యవహార శైలి మీద తీవ్ర ఆగ్రహం లో ఉన్న అధిష్టానం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. మణిశంకర్ అయ్యర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తేనే కాంగ్రెస్ వెంటనే సస్పెండ్ చేసింది, అలాంటి స్వపక్షం నేత ఇలాంటి మాటలు అంటుంటే అది కూడా ప్రధానమంత్రి ని అంటే ఎలా వదిలెయ్యగలము అని ఒక కీలక బిజెపి నేత వ్యాఖ్యానించారు. అందుకే సోము వీర్రాజు ని సస్పెండ్ చెయ్యటానికి ఆవులు వేగం గా కదుపుతున్నారు. అయితే ఒక ఎమ్మెల్సి కావటం తో ఒక సారి ఢిల్లీ నుంచి అప్రూవల్ కోసం వెయిట్

చేస్తున్నట్టు సమాచారం. ఒక వేళ సస్పెన్షన్ కాకపోయినా తీవ్ర క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా చర్యలు ఉంటాయని సమాచారం. తొలుత షో కాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here