రామ్ చరణ్ కుటుంబం లోకి శ్రేయ భూపాల్, త్వరలో వివాహం

Advertisements

గత సంవత్సరం ఈ టైమ్ కి జివికె మనవరాలు శ్రియ భూపాల్ అక్కినేని వారసుడు అఖిల్ ఎంగేజ్మెంట్ కాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. తర్వాత కొన్ని రోజులకి అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ కాన్సిల్ అని మీడియా కు లీకులు వచ్చాయి. అక్కినేని కుటుంబం మిస్సయిన ఛాన్స్ రామ్ చరణ్ ఫామిలి కి వచ్చిందని తెలుస్తుంది. అక్కినేని ఫ్యామిలీతో వియ్యమందుకోవాల్సిన జివికె కుటుంబం హైదరాబాద్ లోనే కాక ఇండియాలోనే అత్యంత ధనవంతుల కుటుంబాల్లో ఒకటని తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ కుటుంబం కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ వైపు చూస్తోందట. దీనితో ముహూర్తం దాకా వచ్చి ఆగిపోయిన అఖిల్ పెళ్లి విషయమే ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకొచ్చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్‌ కీ, అక్కినేని అఖిల్ కీ నిశ్చితార్థం జ‌రిగిన విషయం తెలిసిందే కొన్ని రోజులకి ఆ విషయం సద్దుమణిగింది. ఈలోగా అఖిల్ సోదరుడు నాగచైతన్య పెళ్లి సందట్లో పడింది అక్కినేని కుటుంబం.భారి రేంజ్ లో చైతు సమంతాల వివాహం జరిగింది.

ఐతే జీవీకే మనవరాలు శ్రియా భూపాల్‌ కి త్వరగా పెళ్లి చేసెయ్యాలని ఆ కుటుంబం మళ్ళీ పెళ్లి పనుల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఆ పెళ్లి కి ముహూర్తం కూడా ఖరారైందని వార్తలొస్తున్నాయి. హీరో రాంచరణ్ భార్య ఉపాసన కామినేని కజిన్‌ అనిందిత్ తో శ్రీయా భూపాల్ పెళ్లి నిశ్చయమైందట. ఏదైతేనేం,అక్కినేని ఫ్యామిలీని మిస్సయినా,మెగా ఫ్యామిలీకి దగ్గరవుతోంది శ్రీయా భూపాల్.

Advertisements

Leave a Reply