వామ్మో ఈ డిమాండ్ ఏంటి? ఒక్క సినిమా కి ఇంత తీసుకునే వాళ్ళు తెలుగులో లేరు

Advertisements

మళయాళ క్లాసిక్ తో డెబ్యూ చేసి సౌత్ ఇండియా లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకటైన ఆమెని వరుస వివాదాలు చుట్టూ ముడుతున్నాయి. ఫిదా లో శేఖర్ కమ్ములతో, వరుణ్ తేజ్ తో గొడవ పడిందని వార్తలు వచ్చాయి,తర్వాత MCA తో నాని కి నరకం చూపించింది అని తెలిసింది. మొత్తం మూడు సినిమాల ఎగ్రీమేంట్ చేయించుకున్న దిల్ రాజు, రెండు సినిమాలకే చాలు అనెసాడని టాక్. ఇవన్ని పక్కన పెడితే తమిళ్ స్కెచ్ మూవీ లో సాయి పల్లవి ని భరించలేక….

ఆమె తో షూట్ చేసాక మార్చి తమన్నా ని పెట్టుకున్నాం అని విక్రం అనేసాడు. సెల్వరాఘవన్ సూర్య మూవీ లో సై వాళ్ళ ఇబ్బందులు పడుతున్నాం అని సూర్య కి చెప్పెసారట యూనిట్ సభ్యులు. ఇవన్ని కాక నాగ శౌర్య కణం అనే సినిమా లో సాయి తో చేసి, ఆమెకి ఒక దణ్ణం అంత పొగరు, బాడ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని చూడలేదు అని ప్రెస్ కే చెప్పేసాడు. ఇన్ని వివాదాలు చుట్టు ముడుతున్నా సై పల్లవి క్రేజ్ ఇంచ్ కుడా తగ్గలేదు….ఇప్పటికి తెలుగు లో నిర్మాతలు,దర్శకులు సాయి పల్లవి వెంట పడుతున్నారు. గతేడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. శేఖర్ కమ్ముల ఫిదా మూవీలో తెలంగాణా యాసలో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నానితో చేసిన ఎంసీఏ సినిమా కూడా హిట్ ట్రాక్‌లో పడ్డ ఈ ముద్దు గుమ్మ యూత్ ఐకాన్‌గా మారిపోయింది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్‌లో సైతం తన నటనకు గాను వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా అమ్మడి రెమ్యూనరేషన్ ఎంతో బయటకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. దీని కోసం రూ.1.4 కోట్ల దాకా పారితోషికం అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి.ప్రస్తుతం గ్లామర్ ఉన్న స్టార్ హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న నేపధ్యంలో కేవలం తన నటన తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.తన పక్కన స్టార్ హీరో నటించినా కానీ, ఈమె నటన ముందు తేలిపోవాల్సిందే.. అంతలా అమ్మడు నటనతో ఆకట్టుకుంటుంది.ఇక తెలంగాణలో అయితే ఈమె నటనకు అంత ఫిదా అవుతున్నారు. అందుకే ఈమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారట. దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలి అన్న ఫార్ములా ఫాలో అవుతున్న సాయి పల్లవి తన క్రేజ్ కి తగ్గ రెమ్యునరేషన్ తో దూసుకుపోతుంది.

Advertisements

Leave a Reply