అనవసరపు నోటి దూల తో మళ్ళి దొరికేసిన రవితేజ…ఖర్మ నాయనా

Advertisements

సినిమా నటులు అన్నాక పూలు వేసే వాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు , కాని తట్టుకునే ఓర్పు ఉండాలి. సినిమాలు ప్రమోట్ చేస్కోవాలి తప్పదు, ప్రమోట్ చేసుకునేప్పుడు నెగెటివ్ కామెంట్స్ వస్తే హాండిల్ చెయ్యాలి. చెయ్యలేనప్పుడు మాట జారకూడదు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా గురువారం రవితేజ తన ట్విట్టర్ పేజీలో లైవ్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు ఇచ్చిన రవితేజ ఒక్క పవన్ కల్యాణ్ విషయంలోనూ, పేటీఎమ్ విషయంలోనూ స్పందించిన తీరుతో సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.

పవన్ కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని నెటిజన్ అడిగిన ప్రశ్నకు రవితేజ ఏం చెప్పకుండా ‘నెక్ట్స్’ అంటూ సమాధానమిచ్చారు.చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పలేను అనొచ్చు లేదా చూడనట్టు వదిలేయ్యోచ్చు, నెక్స్ట్ అనే ఆన్సర్ దేనికో ఆయనకే తెలియాలి. మీ పేటీఎమ్ నెంబర్ చెపుతారా? అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అడుక్కునే వాడిలా కనిపిస్తున్నానా?’ అంటూ రవితేజ ఇచ్చిన సమాధానంతో సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. “నాకు పేటీఎమ్ లేదని చెబితే సరిపోయేదానికి ఇలా అడుక్కునే పదాలు వాడటం ఎందుకు అంటూ కొందరు, పేటీఎమ్‌కి అడుక్కునే వాళ్లకి ఏమిటి సంబంధం” అని మరికొందరు నెటిజన్లు రవితేజపై ఘాటుగానే స్పందిస్తున్నారు. కాని ఆ అభిమాని రవి తేజ ఫోన్ నంబర్ ని క్రియేటివ్ గా అడిగాడు, పేటిఎం నంబర్ అంటే ఫాయన్ నంబరే కదా….అంటే రవితేజ ఉద్దేశం లో పేటిఎం అడుక్కునే వాళ్ళు వాడతారా? లేదా ఆటను రవి తేజ కి ముష్టి వెయ్యటానికి అడిగాడా? కాస్త ఆలోచించి మాట్లాడితే బావుండేది. ఇవ్వాళా రిలీజ్ అయిన టచ్ చేసి చూడు భారీ డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.

Advertisements

Leave a Reply