రంగుల రాట్నం బుల్లెట్ రివ్యూ

Advertisements

తెలుగు లో సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు పందెం కోళ్ళలా తలపడటం ప్రతి సంక్రాతికి కామన్ గా జరిగేదే.గత సంక్రాంతికి ఐతే ఏకంగా ఖైది నంబర్ 150, శాతకర్ణి,శతమానం భవతి చిత్రాలు తలపడి విజయాలు సాధించాయి. అలాగే ఈ పండగకి అజ్ఞాతవాసి, జై సింహలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా గ్యాంగ్ కుడా బరిలో దిగింది.వీటన్నితో పాటు చిన్న చిత్రం గా రాజ్ తరుణ్ హీరో గా యాక్ట్ చేసిన రంగుల రాట్నం రిలీజ్ అయ్యింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

రాజ్ తరుణ్ యువనటుల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ మూవీ లో కూడా బాగా చేసాడు

గత సంవత్సరం మా అబ్బాయ్ చిత్రం తో తెలుగు తెరకి పరిచయం అయిన చిత్ర శుక్ల ఈ చిత్రంలో బాగా చేసింది

ప్రియదర్శి కామెడి పెద్ద రిలీఫ్ ఈ చిత్రం లో

కాని ఈ సినిమాకి పెద్ద దెబ్బ చాలా స్లో గా ఉన్న కథనం

మ్యూజిక్ చాలా పెద్ద మైనస్

అన్నపూర్ణ లాంటి సంస్థ నుంచి ఇంకొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తాం

సెంటిమెంట్ డోస్ లిమిట్ దాటింది

ఓవరాల్ గా ఈ ఫిలిం  కాస్త జాగ్రత్త గా చేస్తే ఇంకా చాలా బావుండే చాన్స్ ఉంది, స్లో నేరేషన్ వల్ల బొర్ అనిపిస్తుంది. ఫామిలి ఆడియన్స్ కి నచ్చితే నెక్స్ట్ లెవల్ కి వెళ్ళే అవకాశం ఉంది కాని చెప్పలేము.

రేటింగ్ : 2.5/5

Advertisements

Leave a Reply