రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

Advertisements

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగస్థలం’. ధ్రువ  లాంటి సక్సెస్ తర్వాత రామ్ చరణ్, నాన్నకు ప్రేమతో లాంటి సక్సెస్ తర్వాత సుకుమార్ కలిసి చేస్తున్న తోలి చిత్రం కావటం తో  చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ లుక్, టైటిల్ ఈ సినిమాపై అమితమైన ఆసక్తిని కలిగిస్తే, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాయి. 1980లలో జరిగిన పీరియడ్ ఫిలిం అవ్వటం ఈ చిత్రానికి ఇంకొక ఎడ్వాంటేజ్. శాటిలైట్. డిజిటల్, ఓవర్ సీస్, వైజాగ్, సీడెడ్ హక్కుల నిమిత్తం భారీ ఆఫర్స్ రావడం ఈ సినిమాకున్న క్రేజ్ ని తెలియజేస్తోంది. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారమ్. ఇక రంగస్థలం బిజినెస్ వివరాల్లోకి వెళ్తే…

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 75 కోట్ల పైనే బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. సీడెడ్ – 13కోట్లు, ఉత్తరాంధ్ర – 8.2కోట్లు, ఓవర్సీస్ – 9కోట్లు, తెలుగు శాటిలైట్ – 18కోట్లు, హిందీ శాటిలైట్ – 11.5కోట్లు, డిజిటల్ రైట్స్ – 14కోట్లు, ఆడియో రైట్స్ – 1.5 కోట్లు (టోటల్ 75.2కోట్లు) బిజినెస్ జరిగిందని సమాచారం.ఈ సినిమా కి ట్రేడ్ వర్గాల్లో ఏ రేంజ్ లో క్రేజ్ నెలకొందో ఊహించుకోవచ్చు. మరి ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో, ఎన్ని కోట్ల క్లబ్ లో నిలుస్తుందో, ఎన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో సమంతా పూర్తీ డీ గ్లామర్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకి సంగీతం అందించిన ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మార్చి 30న విడుదలకి ముస్తాబు అవుతుంది.  అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం కోసం 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని గుర్తు చేసేలా ఒక భారీ సెట్ వేసారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి మైత్రి మూవీ మేకర్స్ అప్రతిహత విజయ పరంపర కొనసాగాలని ఆశిద్దాం.

Advertisements

Leave a Reply