రంగస్థలం బుల్లెట్ రివ్యూ

Advertisements

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఈ రోజు విడుదల అయ్యింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.  దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అందరిని ఆకట్టుకుంది. 1985 నాటి పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమాపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అంచనాలు ఉన్నాయి.సుకుమార్ శైలిలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలినుంచీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం…

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

రామ్ చరణ్ మీద ఇప్పటి వరకు ఉన్న కంప్లెయింట్ యాక్టింగ్ లో మేచ్యురిటి లేదు, ఈ మూవీ తో ఆ ఒపినియన్ మారుస్తాడు

సమాంత పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్ర లో ఒదిగిపోయింది

అనసూయ మరొక సర్ప్రైజ్ పాకేజ్

ఆది ఉన్న సీన్స్ పండలేదు అనే చెప్పుకోవాలి

మూడు సాంగ్స్ బావున్నాయి, బాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది

రత్నవేలు సినిమాటోగ్రఫీ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి

ఎడిటింగ్ ఇంకా చాలా బావుండాలి, మూవీ బాగా స్లో గా ఉంది, ముఖ్యం గా సెకండ్ హాఫ్ మొత్తం కూర్చోటం చాలా కష్టం

తొలి సగం బావున్నా, రెండవ సగం కూర్చోటం చాల కష్టం

మూడు గంటలు ఉన్న ఈ సినిమా సెకండ్ హాఫ్ మెలో డ్రామా ని తట్టుకుని కూర్చోవటం కాస్త కష్టమే

సుకుమార్ అన్ని చిత్రాల లానే సెకండ్ హాఫ్ మిస్ అయ్యింది

ఓవరాల్ గా రంగస్థలం 80s బాక్ డ్రాప్ వల్ల, రాం చరణ్ పెర్ఫార్మెన్స్ వల్ల పర్లేదు అనిపిస్తుంది. మాములు గా అయితే మూడు గంటల ఈ మూవీ మొత్తం కూర్చోవటం కష్టమే. రాం చరణ్ వీరాభిమానులు అయితే హాపి గా చుసేయండి. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ నుంచి ఒక చెప్పుకోదగ్గ సినిమా.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.75/5

Advertisements

Leave a Reply